కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన

0
274

*కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన*

 

*సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి*

 

*సింధనూరు:* 

కర్ణాటకలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పర్యటించారు. రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా కళ్యాణ మండపం ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక తెలుగుసంఘం నాయకులు, తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పట్ల నిర్వాహకులను అభినందించారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకునేందుకే ఇక్కడకు వచ్చాను. తెలుగువారు ఎక్కడున్నా టీడీపీ అండగా ఉంటుంది. కుమారస్వామి గారి పక్కన నిల్చునే అదృష్టం నాకు కలిగింది. తెలుగువారి మద్దతకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి నారా లోకేష్ ను శాలువా, ప్రత్యేక జ్ఞాపితకో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

*****

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు...
By Kothuru Murali 2026-04-19 11:00:54 0 131
Andhra Pradesh
శ్రీవారి భక్తులకు సరికొత్త అనుభూతి.. ప్రారంభానికి సిద్ధమైన వరల్డ్ క్లాస్ ఎస్వీ మ్యూజియం.
తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది....
By Pagadala Venkateswar 2026-09-08 09:53:05 0 110
BMA
Ethical Journalism Builds Lasting Public Confidence
Ethical journalism is founded on accuracy, fairness, impartiality, and accountability....
By JoinBMA 2026-08-20 09:18:16 0 164
Telangana
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన...
By Nookapangu Manikanta 2026-04-16 08:10:46 0 175
Andhra Pradesh
దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️
దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️ దర్శి పట్టణం 19వ వార్డ్‌లో రూ.51.50 లక్షల...
By Chennaiah Kati 2026-07-04 14:33:01 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com