గోహత్యల నివారణ ధ్యేయంగా ఏప్రిల్ 27న గో సన్మాన ఆహ్వానం అభియాన్ కార్యక్రమం

0
273

*గోహత్యల నివారణే ధ్యేయం గా ఏప్రిల్ 27న ‘గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం*

 

*విజయవాడ:* దేశంలో గోహత్యలను పూర్తిగా అరికట్టి, గోమాతకు తగిన గౌరవాన్ని, స్థానాన్ని తిరిగి కల్పించడమే లక్ష్యంగా,గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్, (గో గౌరవ ఆహ్వాన ఉద్యమం) పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉద్యమ ప్రతినిధులు వెల్లడించారు. శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోవత్ కిరణ్ కృష్ణ, సభ్యులు హరిసింగ్, కృష్ణ, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యమానికి ఏ వ్యక్తి లేదా సాధువులు నాయకత్వం వహించడం లేదని స్వయంగా గోమాత ప్రధాన సంరక్షకుడు నంది బాబా అధ్యక్షతన వారి మార్గదర్శకత్వంలోనే ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. నిర్దాక్షిణ్యంగా కోతకు గురవుతున్న సుమారు 80 వేల గోవుల ప్రాణాలను రక్షించాలని, గోహత్యలపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 27, 2026న ఈ అభియాన్ లో భాగంగా ఒక 

సంతకాల సేకరణ (సిగ్నేచర్ కాంపెయిన్) నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సంతకాలు చేసి ఆ పత్రాలను ప్రభుత్వ అధికారులకు అందజేయాలని కోరారు.

గోమాత హోదా గోవును కేవలం జంతువుగా కాకుండా మన సంస్కృతికి మూలమైన 

రాష్ట్ర మాత రాష్ట్ర దేవిగా 

గుర్తించాలని ఈ అభియాన్ డిమాండ్ చేస్తోంది అన్నారు.

 

సభ్యులు హరిసింగ్ మాట్లాడుతూ సనాతన ధర్మంలో పుట్టినప్పటి నుండి మరణం వరకు గోవుకు విడదీయలేని సంబంధం ఉందని గుర్తుచేశారు. ఒకప్పుడు ప్రతి 15-18 మందికి ఒక ఆవు ఉండేదని, నేడు ఆ పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జెర్సీ ఆవు పాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, భారతీయ దేశీ ఆవు పాల విశిష్టతను గుర్తించాలని,శాంతియుత మార్గంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గోహత్యలను నిరోధించడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు...

Search
Categories
Read More
Telangana
మృతుడి కుటుంబానికి సర్పంచ్ భరోసా ఆర్థిక సహాయం
ఈ రోజు మన గ్రామంలో చింతకాయలు లక్మయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబాని పరామర్శించారు...
By MERIGE MALLESH 2026-07-31 07:58:06 0 381
BMA
Voice Biometrics: Identifying Talkers in Clandestine Audio
A primary aspect of modern audio forensics involves identifying talkers and accurately...
By JoinBMA 2026-08-21 18:11:26 0 271
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ వద్ద దళిత, గిరిజనుల హక్కుల కోసం భారీ ధర్నా. సబ్‌ప్లాన్ నిధులు, భూ పంపిణీ, స్మశాన స్థలాల కోసం ఏఐఏడబ్ల్యూయూ, కేవీపీఎస్ నిరసన.
Madanapalle: దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్...
By Pagadala Venkateswar 2026-09-02 09:13:29 0 75
Telangana
(SIR)ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఆసిఫాబాద్, జూలై 11 : భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు పూర్తి...
By Avunoori Mahesh 2026-07-11 11:35:31 0 322
SURAKSHA
Dial 112: Fast Emergency Response System
 Goa Police upgraded Dial 112 emergency service for instant help. When you call, GPS traces...
By Kalaga Sailaja 2026-07-03 08:06:07 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com