చీరాలలో రహదారి భద్రతపై శక్తి టీం భారీ అవగాహన

0
419

చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మోయిన్ సూచనలతో శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శక్తి టీం ఎస్సై హరిబాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని ఒక భారంగా భావించకూడదని, అది ప్రాణరక్షణకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా చీరాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి తనిఖీలు అవగాహన సదస్సులు నిరంతరం కొనసాగుతాయని శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కరూర్ తొక్కిసలాట ఘటన పై ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి
 హైదరాబాద్:   - TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ. - తమిళనాడులోని...
By Sidhu Maroju 2025-09-28 14:13:36 0 352
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సదుం మండలంలో పర్యటించిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పర్యటించారు....
By Kothuru Murali 2026-04-30 11:27:08 0 123
Andhra Pradesh
ప్లేవుడ్ పరిశ్రమను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు...
By Boiena Rajesh 2026-04-19 04:00:31 0 194
Andhra Pradesh
బీజేపీ. జిల్లా ఎస్సీ మోర్చా ద్వారా గురు రవి దాస్ జయంతి
 గురు రవి దాస్ 649 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. గా జు వాక నందు బిజెపి జిల్లాఎస్సీ మోర్చా...
By Mobbu Venkatramana 2026-02-04 12:20:45 0 485
Andhra Pradesh
అంజుమన్ ఆస్తుల పరిరక్షణకు ఐక్యతే మార్గం: ముఫ్తీ అబ్దుల్ బాసిత్.
గుంటూరు:అంజుమన్ ఇస్లామియా ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జమీయతుల్ ఉలమా రాష్ట్ర...
By John Baji 2026-01-06 12:38:30 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com