Chandrababu: ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌.

0
189

సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. డిగ్రీ చదివిన తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఓ తల్లి కోరగా, అతనికి ఆటో కొనివ్వమని సీఎం చెప్పారంటూ ఈ వీడియోను ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

 

ఇటీవల తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలైన ముక్కర అంబిక ఇంటికి ఆయన వెళ్లారు. అక్కడ వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకునే క్రమంలో ఆటో డ్రైవర్ అయిన ఆమె భర్తకు జీవనోపాధి కోసం ఒక బ్యాటరీ ఆటోను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

 

సీఎం ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎదురింటికి చెందిన మరో మహిళ తన డిగ్రీ చదివిన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కొందరు దురుద్దేశంతో అంతకుముందు సీఎం అంబిక భర్తకు ఆటో ఇప్పించాలని ఇచ్చిన ఆదేశాలను, ఈ మహిళ చేసిన అభ్యర్థనకు జతచేసి "చదువుకున్న యువకుడికి ఆటో కొనిస్తారట" అంటూ తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారు.

 

ఈ వ్యవహారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగంతో పాటు మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. రెండు వేర్వేరు వీడియో క్లిప్పులను కలిపి "కట్ అండ్ పేస్ట్" చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో లోపాలు వెతకలేకే, వైసీపీ ఇలాంటి తప్పుడు వీడియోలతో బురదజల్లే ప్రయత్నం చేస్తోందని లోకేశ్‌ ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. సీఎం చంద్రబాబు పేదల పక్షపాతి అని, ప్రజలకు వాస్తవాలు తెలుసని లోకేశ్‌ పేర్కొన్నారు.

 

Search
Categories
Read More
Telangana
"ఆదివారం నుంచి కనిపించని బాలుడు.. సమాచారం ఇవ్వాలంటూ పోలీసుల విజ్ఞప్తి.|
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా : బొల్లారం బజార్ ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలుడు అదృశ్యమైన ఘటన...
By Sidhu Maroju 2026-06-03 09:08:58 0 243
Andhra Pradesh
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి...
By Gadiyapudi Narendra 2025-12-30 17:07:05 0 296
Andhra Pradesh
మదనపల్లె: హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్.
మదనపల్లె మండలం దేవతానగర్ వద్ద గత నెల 25న ముగ్గురు వ్యక్తులపై కర్రలతో దాడి చేసి, హత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-03-03 09:12:38 0 217
Andhra Pradesh
పుంగనూరు: బలమైన నాయకులను జైల్లో పెడుతున్నారు: ఎంపీ
తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టి ఆనందం పొందుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-03-17 07:03:36 0 194
Andhra Pradesh
అడవి పంది ఢీకొన్న దివ్యచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు పంది మృతి
అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు, పంది మృతి మార్కాపురం...
By Chennaiah Kati 2026-03-14 06:18:17 0 566
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com