ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష

0
245

_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కోలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేనేత కార్మికులు, చేనేత నాయకులు మరియు వైసీపీ నాయకులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని డాక్టర్ పద్మశ్రీ మాచాని సోమప్ప గారి కూడలి వద్ద ఉద్వేగభరిత వాతావరణంలో జరిగింది.ఈసందర్భంగా మాట్లాడిన నాయకులు, ఎమ్మిగనూరు వివర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు ఆప్కోలో విలీనం అనే నిర్ణయం చేనేతల అస్తిత్వంపై నేరుగా దాడి చేసినట్లేనని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆప్కోలో లాభదాయకంగా, స్థిరంగా నడుస్తున్న ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను విలీనం చేయడం వెనుక తీవ్రమైన దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఈ చర్య వల్ల చేనేతల స్వావలంబన పూర్తిగా దెబ్బతిని, మళ్లీ మధ్యవర్తుల ఆధీనంలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో *" మున్సిపల్ అధికారులతో కలిసి"*...
By Sadaq Sadaq 2026-06-11 09:28:08 0 155
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం
*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*   *పోలవరం, జనవరి...
By Rajini Kumari 2026-01-20 10:58:14 0 227
Telangana
హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట భూములు కోల్పోయిన రైతుల ధర్నా
హుజూర్‌నగర్, జూలై 27:   వ్యవసాయ కళాశాల కోసం 1041 సర్వే నంబరులో భూములు కోల్పోయిన...
By Malla Rambabu 2026-07-27 14:14:37 0 201
Andhra Pradesh
ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు సద్వినియోగం చేసుకోండి డాక్టర్ సుధ డిసెంబర్ 31 సాయంత్రం లోపు నమోదు చేసుకోండి రామకృష్ణ వివేకానంద రెడ్డి
*తాడేపల్లి*   *ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ని 9 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలు...
By Rajini Kumari 2025-12-30 10:14:46 0 255
Telangana
జనవరి 18న ఛలో ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా...
By Bheeshman King 2026-01-16 13:24:26 0 977
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com