ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష

0
246

_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కోలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేనేత కార్మికులు, చేనేత నాయకులు మరియు వైసీపీ నాయకులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని డాక్టర్ పద్మశ్రీ మాచాని సోమప్ప గారి కూడలి వద్ద ఉద్వేగభరిత వాతావరణంలో జరిగింది.ఈసందర్భంగా మాట్లాడిన నాయకులు, ఎమ్మిగనూరు వివర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు ఆప్కోలో విలీనం అనే నిర్ణయం చేనేతల అస్తిత్వంపై నేరుగా దాడి చేసినట్లేనని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆప్కోలో లాభదాయకంగా, స్థిరంగా నడుస్తున్న ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలను విలీనం చేయడం వెనుక తీవ్రమైన దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఈ చర్య వల్ల చేనేతల స్వావలంబన పూర్తిగా దెబ్బతిని, మళ్లీ మధ్యవర్తుల ఆధీనంలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.‌ఈ యునిట్...
By Karapati Gopi 2026-06-24 12:54:55 0 294
Andhra Pradesh
వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో...
By Ratna Sekhar 2026-02-28 19:39:46 0 2K
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 189
Telangana
వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|
● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా ● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని...
By Sidhu Maroju 2026-07-31 10:48:20 0 120
Andhra Pradesh
జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు...
By Pagadala Venkateswar 2026-04-05 05:34:30 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com