కొండెక్కిన కోడి దిగింది కేజీ 270

0
217

*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు* ఈ మధ్యకాలంలో పౌల్ట్రీ కోడి మాంసము రేటు గణనీయంగా పెరగడంతో చికెన్ ప్రియులకు ఇది పెద్ద ఇబ్బందిగానే మారింది. అంతగా కొండేక్కిన కోడి రేటును చూసి అయ్యో అంటూ తినకుండా మానుకున్న రోజులు ఉన్నాయి. ఇక ఇప్పుడిప్పుడే కొండేక్కిన కోడి రేటు మాత్రం మెల్లగా దిగి వస్తుంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్లో 270 కిలోగా అమ్మకాలు జరుగుతున్నాయి. *ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు.. కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు..* చికెన్ లవర్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే. గతవారం భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఈ వారం అమాంతం తగ్గిపోయాయి. మార్చి నెల ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.360- రూ.400 పలికింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు చనిపోవడం, వాటి దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫారమ్ల యజమానులు ధరలను పెంచారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా ఉండటంతో చికెన్ కు గిరాకీ ఏర్పడింది. వెరసి స్కిన్ లెస్, నార్మల్ చికెన్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరడంతో.. చికెన్ ప్రియులంతా సీ ఫుడ్ వైపు మళ్లారు. వారంరోజుల తర్వాత కిలో చికెన్ రేటు ఏకంగా రూ.100 వరకూ తగ్గింది. హైదరాబాద్ లో నేడు స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.270గా ఉండగా.. అటు వరంగల్ లోనూ అదే ధర కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో మాత్రం రూ.300-350 పలుకుతోంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు మారుతుంటాయని వ్యాపారస్తులు తెలిపారు..!!

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్,...
By Kothuru Murali 2026-07-30 13:28:37 0 248
Andhra Pradesh
ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు.
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఎండలు...
By Pagadala Venkateswar 2026-04-09 04:48:21 0 200
Telangana
ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్...
By Vangari Praveen 2026-05-18 08:25:06 0 806
Andhra Pradesh
ఆటోలకు సీరియల్ నంబర్లు ఏర్పాటు* *ప్రతి సీరియల్ నెంబర్ ఆటో డ్రైవర్ల పేరు పోలీస్ స్టేషన్లో నమోదు* *ప్రయాణికులకు ధైర్యం కలిగించేలా పోలీస్ వ్యవస్థ* *ప్రజల భద్రతే లక్ష్యంగా వినూత్నంగా వ్యవహరించిన వేదులపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు*
ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతి ఒక ఆటోకు ఒక సీరియల్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ధైర్యం కలిగేలా...
By Vadlamudi NagaVenkat 2026-06-27 09:37:15 0 300
Andhra Pradesh
యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు.
  యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు...
By Pagadala Venkateswar 2026-06-18 05:16:26 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com