ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్

0
432

అధికారులే మీ వద్దకు.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్

కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు, గృహ నిర్మాణం, రేషన్, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ పాలనలో లక్షల కోట్ల అప్పులతో సంక్షోభంలో పడిందని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామానికి పరిపాలనను తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, అధికారులు మరియు కూటమి నేతలు, స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Syed Ali Murtaza Rizvi IAS: A Vision for Good Governance
A distinguished Telangana IAS officer whose administrative excellence, visionary leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-10 10:23:00 0 180
BMA
Sports Watchdogs: Exposing Offshore Betting Rings
Indian sports journalism in 2026 has evolved far beyond match reporting, taking on massive...
By JoinBMA 2026-08-21 09:21:32 0 90
Telangana
త్రివేణి సంగమ తీరంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.....!
భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో భాగంగా త్రిలింగ...
By Gujile Ramu 2026-05-25 03:34:51 0 164
Andhra Pradesh
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత మార్ధాన్ రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్
భారతీయ జనతా యువమోర్చా   ప్రచురణ కొరకు...     *స్వామి వివేకానంద స్ఫూర్తి తో...
By Rajini Kumari 2026-01-11 09:37:38 0 223
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి,...
By John Baji 2025-12-31 16:16:01 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com