బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|

0
211

హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళనలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పూర్తి మద్దతు ప్రకటించారు. 

శనివారం మార్కెట్ సందర్శించిన ఆయన, స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మార్కెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, వినియోగదారులకు కనీస టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. 

మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.

ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నిరసనలో బిజెపి సీనియర్ నేత చింతల మాణిక్య రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం రైతన్నలకు భరోసా
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు...
By Rajini Kumari 2026-04-04 14:43:21 0 253
Tamilnadu
Tamil Nadu Strengthens Law and Public Safety Measures
Tamil Nadu continues to enhance law and order through police modernization, technology-driven...
By Fathima Safa 2026-06-29 10:51:14 0 139
Telangana
"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్...
By Sidhu Maroju 2026-04-24 12:50:19 0 302
Telangana
నిజామాబాద్
రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో *" మున్సిపల్ అధికారులతో కలిసి"*...
By Sadaq Sadaq 2026-06-11 09:28:08 0 156
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com