APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.

0
220

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్పీలోని 300 హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్ఎస్ఐ) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ హోం శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 62ను విడుదల చేసింది. 

 

ప్రభుత్వ నిర్ణయంతో 8 ఏపీఎస్పీ బెటాలియన్ల పరిధిలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్‌గ్రేడ్ చేసిన 300 ఏఆర్ఎస్ఐ పోస్టులకు బదులుగా, అంతే సంఖ్యలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కర్నూలు (2వ బెటాలియన్), కాకినాడ (3వ), విజయనగరం (5వ), మంగళగిరి (6వ) బెటాలియన్లలో ఒక్కొక్కదానికి 42 చొప్పున పోస్టులను కేటాయించారు. అలాగే, 9, 11, 14, 16వ బెటాలియన్లకు తలా 33 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు. 

 

రాష్ట్ర డీజీపీ 2025 జనవరి 31న పంపిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు 2026 మార్చి 14న రాష్ట్ర కేబినెట్, మార్చి 26న ఆర్థిక శాఖ ఆమోదం తెలిపాయి. తాజాగా హోం శాఖ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా...
By Veeresh Kumar 2026-03-26 14:03:50 0 449
Tamilnadu
"జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|
హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి...
By Sidhu Maroju 2026-06-15 12:23:27 0 396
SURAKSHA
Guardian of the Streets: The Journey of Shri G.S. Malik
Unwavering Resolve, Tactical Brilliance, and Absolute Commitment to Public Safety Within the...
By Kalaga Sailaja 2026-07-28 13:28:45 0 158
Maharashtra
Leading the Charge: Maharashtra’s VVIPs Pivot to EVs
In a significant push for green energy, Deputy CM Eknath Shinde officially transitioned his...
By Dunna Jessicaruth 2026-05-15 05:39:46 0 141
Media Academy
The Power Of Truth In An Age Of Misinformation
The Power Of Truth In An Age Of Misinformation In An Era Of Information Overload And...
By Media Academy 2025-04-28 18:35:58 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com