ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం

0
250

*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*

 

*-నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్*

 

*రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం*

 

చల్లపల్లి: 

 

ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం అని నియోజకవర్గ యువనాయకులు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం చల్లపల్లి సాయి నగరులోని పద్మావతి హాస్పిటల్ వద్ధ సినీ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో స్వచ్చంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ మచిలీపట్టణం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారిచే ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా మండలి వెంకట్రామ్ విచ్చేసి రామ్ చరణ్ జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి పంచిపెట్టారు. రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి భవిరి శంకర్ నాధ్ తో కలిసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి చిరంజీవి నుంచి సేవాగుణం, బాబాయి పవన్ కళ్యాణ్ నుంచి ఆధ్యాత్మిక నడవడిక అలవర్చుకున్న రామ్ చరణ్ మెగా అభిమానులకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారని తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వేలాది రక్తదాన శిబిరాలు నిర్వహించిన చిరంజీవి స్ఫూర్తితో మెగా అభిమానులు సమాజానికి మేలు చేస్తూ ప్రత్యేక సందర్భాల్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి నిర్వాహకులను అభినందించారు. 

 

ఈ శిబిరంలో మెగా అభిమానులు, పద్మావతి హాస్పిటల్ సిబ్బంది, రక్తదాతలు, పాత్రికేయులు, రెడ్ క్రాస్ సభ్యులు, పలువురు యువకులు 35మంది రక్తదానం చేశారు. మచిలీపట్నం పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు డాక్టర్ డీ.హనుమంతయ్య, రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ కే.హరికృష్ణ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది బ్లడ్ యూనిట్స్ సేకరించారు.

 

చిరంజీవి యువత కృష్ణాజిల్లా జాయింట్ సెక్రటరీ మడమల రంజిత్ కుమార్, మెగా అభిమానులు వేల్పూరి ప్రసాద్ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణాజిల్లా శాఖ కార్యదర్శి భవిరి శంకర్ నాథ్, జిల్లా కోశాధికారి పడమట సుకుమార్, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, చల్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, డీ.ఆర్.ఓ సీసీ తూము వెంకటేశ్వరరావు, నియోజకవర్గ చిరంజీవి యువత నాయకులు అప్పికట్ల తారక మస్తాన్, సిద్ధినేని అశోక్ నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ చల్లపల్లి శాఖ చైర్మన్ నడకుదురు లీలా బ్రహ్మేంద్ర, ట్రెజరర్ ఎండీ.ఏ.కే.జిలాని, జనసేన పార్టీ మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు తోట మురళీకృష్ణ, మిరియాల జితేంద్ర, రెడ్ క్రాస్ సభ్యులు చల్లపల్లి సబ్ బ్రాంచ్ సభ్యులు ఆకురాతి హరిప్రసాద్, షేక్ ఎజాజ్ అహమద్, జనసేన నాయకులు అనుమకొండ పూర్ణ చంద్రశేఖరరావు, బండి నాగార్జున, బుల్లా కిషోర్, సోమిశెట్టి రాఘవేంద్రరావు, టీడీపీ నేతలు ముమ్మనేని సన్నీ, దిరిశం వెంకట్రావ్, డాక్టర్ ముత్యాల వరప్రసాద్ (చిన్న డాక్టర్), విశ్రాంత ఉపాధ్యాయుడు అడపా గురవయ్య, ఉపాధ్యాయులు నారంశెట్టి వెంకటేశ్వరరావు, వై.రవి, కస్తూరి విజయ్, సాధనాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. శిబిర నిర్వహణకు పద్మావతి ఆసుపత్రి సిబ్బంది తమవంతు సహకారం అందచేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది....
By Gadiyapudi Narendra 2026-02-20 05:04:17 0 224
SURAKSHA
A. Vikranth Raja, IAS: Shaping Growth Through Governance
A dynamic 2015-batch IAS officer of the AGMUT cadre, A. Vikranth Raja has emerged as a key...
By Lokeshwari Panthadi 2026-07-22 06:14:58 0 407
Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
By Benguluri Madhubabu 2026-02-09 08:00:49 0 317
Telangana
22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి ప్రజల భూములను తొలగించాలి.|
● ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● 30 వేల...
By Sidhu Maroju 2026-08-18 09:33:32 0 135
Andhra Pradesh
మాచర్ల రామ్మోహన్‌రావుపై దాడి హేయమైన చర్య: చేనేత నాయకులు.
చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చేనేత నాయకుడు మాచర్ల రామ్మోహన్‌రావుపై జరిగిన దాడిని...
By Pagadala Venkateswar 2026-06-11 05:28:33 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com