విశ్వబ్రాహ్మణ సంఘం చెక్క కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆవు దూడ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థన

0
234

*విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న కత్తురోజు రామకృష్ణ*

 

*ఆవుదుడ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన రామకృష్ణ*

 

*జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లిలో మజ్జిగ పంపిణీ*

 

దారు(చెక్క పని) శిల్పకళా కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు కత్తురోజు రామకృష్ణ. త్వరలో జరగనున్న విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తనను ఆవు దూడ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న పొట్లూరు చిరంజీవి ఆచార్య ను కూడా ఆవుదుడా గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లి కిల్లా రోడ్డు బొమ్మల కాలనీలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రామకృష్ణ. అనంతరం ఆయన మాట్లాడుతూ చెక్క పని చేసే దారుసిల్పులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా కొండపల్లిలో తెల్లపునికి చెట్లు లభించకపోవడం, ఆర్థికంగా అవకాశాలు లేకపోవడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అవకాశాలు కల్పించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. పోరాడేందుకు తనకు అందరి సహకారం కావాలని ఏప్రిల్ 12న జరిగే ఎన్నికలలో ఆవుదుడ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Mahesh Kumar Aggarwal, IPS: A Visionary Police Leader Inspiring India
From combating organized crime to driving technology-enabled policing, Mahesh Kumar Aggarwal,...
By Lokeshwari Panthadi 2026-07-20 09:28:02 0 195
Telangana
ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
సినీ ప్రి ప్రియులంతాయులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ...
By Ponnala Srinivasrao 2026-03-16 10:41:26 0 283
Andhra Pradesh
కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం – లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ
కాకినాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని...
By Ratna Sekhar 2026-02-13 05:39:20 0 517
Andhra Pradesh
YSRCP: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: పార్లమెంటు వద్ద వైసీపీ ఎంపీల నిరసన.
ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని నినాదాలు...
By Pagadala Venkateswar 2026-02-03 07:12:41 0 334
Telangana
పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|
● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ● ముగ్గురు అరెస్ట్.. 8...
By Sidhu Maroju 2026-07-29 16:21:23 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com