రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి

3
2K

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ తో పాటు ఎస్సీ ఎస్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సింగరేణి ఆర్జి వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సతి సమేతంగా హాజరై శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ ప్రాంతంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న వేడుకలకు ముఖ్య అతిథులుగా వేరు వేరుగా వీరు హాజరయ్యారు. గోదావరిఖని లోని ప్రధాన కోదండ రామాలయానికి ఎమ్మెల్యే తన సతీమణితో పట్టు వస్త్రాలతో తలంబ్రాలను నెత్తిపై తాంబూలంలో పెట్టుకొని వచ్చి బ్రాహ్మణ పురోహితులకు రామాలయంలో తలంబ్రాలను అందజేశారు. అర్జీ వన్ జనరల్ మేనేజర్ జిఎం కాలనీ, శారద నగర్ ఏరియాలో ఉండే దేవాలయాలకు అతిథులుగా హాజరై పూజలు నిర్వహించారు. అక్కడి భక్తులు అడిగిన సౌకర్యాలను తప్పకుండా సమకూరుస్తానని జిఎం లలిత్ కుమార్ హామీ ఇచ్చారు. అలాగే జిఎం కాలనీలో ఉండే ఆంజనేయస్వామి ఆలయంలో వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60 డివిజనల్ లలో ఉండేటువంటి ఆంజనేయస్వామి దేవాలయాల వద్ద ఎనిమిదవ కాలనీ, విట్టల్ నగర్, తిలక్ నగర్,  కళ్యాణ్ నగర్, గౌతమి నగర్, ద్వారకా నగర్ ఆ ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతమంతా జైశ్రీరామ్ అంటూ జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతల కొడుతూ ప్రతి దేవాలయాల వద్ద వేలాది మంది భక్తులతో పూజలు నిర్వహించారు. 

రంగు శ్రీనివాస్ 

రామగుండం మండలం రిపోర్టర్

పెద్దపల్లి జిల్లా 

Like
1
Search
Categories
Read More
Telangana
కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర...
By Jagadeesh Babu 2026-05-27 14:27:29 0 419
Telangana
"తెలంగాణలో కొత్త పార్కింగ్ షాక్.. అడ్డగోలుగా పార్క్ చేస్తే బండి వేలానికే!
హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అదుపు...
By Sidhu Maroju 2026-05-14 06:18:45 0 392
Andhra Pradesh
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: కలెక్టర్
వీరఘట్టం మండలం కంబరలో మన బాట మన మాట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి డ్వాక్రా మహిళలతో...
By Boiena Rajesh 2026-09-01 14:09:32 0 89
Bharat Aawaz
Article 13 – The Shield That Protects Your Rights
What is Article 13? Article 13 is like a guardian of your Fundamental Rights. It says that no...
By BMA ADMIN 2025-06-26 08:45:25 0 3K
Andhra Pradesh
జగన్మోహన్ రెడ్డి మావిగన్ జోకర్ వైయస్ షర్మిల రెడ్డి
BREAKING   విజయవాడ    *జగన్ మోహన్ రెడ్డి “మావిగన్ జోకర్” - వైఎస్...
By Rajini Kumari 2026-04-10 06:36:44 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com