చంద్రబాబు- లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టను. -సమాజం తలదించుకునేలా రాష్ట్రంలో కూటమి పాలన. -ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు జాతి యావత్తు గర్వపడాలి. -ముద్రగడ నివాసంలో వైసిపి నాయకులు అంబటి రాంబాబు.

0
554

కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండతో ప్రజల సహకారంతో న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అన్నారు.మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడి ఆయన నివాసంలో అంబటి రాంబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ ఇంటికి చేరుకున్న రాంబాబుకు ముద్రగడతోపాటు,ఆయన తనయుడు, ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబంపై దాడి దాడి చేయడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులపట్ల అమానుషంగా ప్రవర్తించిందన్నారు.దానికి ప్రతిఫలంగా ఐదు సంవత్సరాలు టిడిపి అధికారం కోల్పోయిందని గుర్తుచేశారు.ముద్రగడ లాంటి పట్టుదల గల వ్యక్తి అరుదుగా ఉంటారని, ఇచ్చిన మాట కోసం పేరు మార్చుకున్న ఘనత ముద్రగడకే దక్కుతుందన్నారు. ముద్రగడ లాంటి వ్యక్తి కాపు కులంలో పుట్టినందుకు కాపు జాతి గర్వపడాలన్నారు.కూటమి ప్రభుత్వం నాపై దాడి చేసి నా ఇంటిని, కారును, ఫర్నిచర్ ను ధ్వంసం చేసి అత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిందన్నారు. నా కుటుంబ సభ్యుల పట్ల అమానుషంగా ప్రవర్తించి నన్ను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసిందన్నారు.నాపై ఎన్ని కేసులు పెట్టినా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సహకారంతో న్యాయపోరాటం చేస్తూనే ఉంటానన్నారు. చంద్రబాబును లోకేష్ ను వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే హైకోర్టులో రెండు రిట్ ఫిటిషన్ లు వేయడం జరిగిందన్నారు. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండతో ముద్రగడ లాంటి నాయకుల ఆశీస్సులతో నా కులం బలంతో దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని రాంబాబు అన్నారు.ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబు, జక్కంపూడి రాజా,చినబిల్లి వెంకటరాయుడు,తోట రామకృష్ణ,యనమల శ్రీకృష్ణుడు,అధిక సంఖ్యలో ప్రత్తిపాడు నియోజకవర్గం వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు  15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:10:49 0 227
Andhra Pradesh
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి నాయకులు
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో...
By Boya Dasthagiri 2026-05-17 09:50:40 0 213
Andhra Pradesh
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం.
ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-05-11 06:34:44 0 128
Telangana
నూతన పవర్ బోర్ వెల్ ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్  3 వార్డు మడ్ ఫోర్డ్ తిరు తుల్కంతమ్మన్ దేవాలయానికి...
By Sidhu Maroju 2025-12-19 07:21:00 0 244
Andhra Pradesh
సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు.
X సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు 25-06-2026 Thu Andhra CI...
By Pagadala Venkateswar 2026-06-25 06:14:38 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com