ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ నాంది పలికిన బోండా ఉమామహేశ్వరరావు

0
260

ప్రచురణార్థం:- 26-03-2026

 

*ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ – ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు*

 

ధి:- 26-03-2026 ఈరోజు గురువారం సాయంత్రం BRTS రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు విలేకరుల సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తును మార్చివేసే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ స్థాపనపై పలు కీలక విషయాలను వెల్లడించారు.

 

ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ:- అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పరిధిలో ఏర్పడనున్న ఈ మహత్తర ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని తెలిపారు.

 

సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడులతో స్థాపించబడుతున్న ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. ముఖ్యంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు.

 

ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పరిశ్రమల అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన విజన్, మంత్రి నారా లోకేష్ గారి కృషి , పెట్టుబడిదారులతో సమన్వయం వలననే ఇలాంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయని, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని...

 

“జాబ్స్ ఫస్ట్ ” విధానంతో యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ స్టీల్ ప్లాంట్ ఆ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, శిక్షణ కార్యక్రమాలు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు మరింత అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు.

 

ఈ ప్రాజెక్ట్ వలన ఉత్తరాంధ్రలో రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతాయని, దీంతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. అలాగే MSMEలు, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి చెందడంతో స్థానిక వ్యాపారాలకు ఊతం లభిస్తుందని అన్నారు.

 

సుమారు 5,465 ఎకరాల్లో నిర్మించబడనున్న ఈ భారీ పరిశ్రమ మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమై, తరువాతి దశలో 10.5 మిలియన్ టన్నులకు విస్తరించనుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపనున్నదని అన్నారు.

 

ఈ ప్రాజెక్ట్ అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, పెట్టుబడులు మరింతగా ఆకర్షితమై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దేశంలో ముందంజలో నిలుస్తుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

 

చివరిగా, ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా యువత భవిష్యత్తును మార్చే శక్తివంతమైన అభివృద్ధి యంత్రంగా నిలుస్తుందని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సువర్ణయుగానికి నాంది పలుకుతుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు తెలిపారు.

 

ఈ సమీవేశంలో :- టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబు అవార్డు పట్ల తెదేపా శ్రేణుల పాలాభిషేకం లుక్కా
ప్రచురణార్ధం.19.12.25   చంద్రబాబుగారికి వచ్చిన అవార్డు పట్ల తెదేపా శ్రేణుల...
By Rajini Kumari 2025-12-20 13:22:20 0 227
BMA
Spyware Warfare: Governments Illegally Target Journalists
Governments globally are increasingly deploying sophisticated spyware like NSO Group’s...
By JoinBMA 2026-08-19 10:08:45 0 72
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-02-03 07:20:50 0 255
Andhra Pradesh
సీఎం పర్యటనలో అలసత్వం వద్దు: హోంమంత్రి అనిత
పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి CM చంద్రబాబు ఈనెల 28న రావివలస రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు...
By Boiena Rajesh 2026-02-25 14:30:25 0 346
SURAKSHA
Arun Pal Singh IPS: Visionary Leader of Punjab Prisons
A Distinguished IPS Officer Transforming Prison Administration Through Integrity, Reform,...
By Lokeshwari Panthadi 2026-07-25 10:34:26 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com