అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.

0
425

మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం,.

సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.గత ప్రభుత్వ కాలంలో కొత్తవలసలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర కృషి చేసి సాధించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత గిరిజన శాఖ మంత్రివర్యులు ఇప్పటివరకు ఒక్కసారైనా ఆ యూనివర్సిటీని సందర్శించలేదని ప్రశ్నించారు.

పేరుకే గిరిజన శాఖ మంత్రి ఉన్నా, గిరిజనుల సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గంలో గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని విమర్శించారు. సుమారు రూ. 3.30 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాగ్ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోందని తెలిపారు.ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

అదేవిధంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా అధికారులు శాశ్వతమని, చట్టాలు, జీవోలు ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై పనిచేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో విచారణ తప్పదని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్టీసీలో 7673 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం
ప్రభుత్వాన్ని కోరిన ఆర్టీసీ పాలకమండలి. ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్,...
By Gadiyapudi Narendra 2026-01-27 16:19:31 0 283
Entertainment
Yesteryear actress legendary savukari janaki expired
ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు...
By G k Nookala 2026-08-21 10:50:52 0 141
SURAKSHA
Dr. Pritpal Kaur IPS: Leading with Courage and Compassion
A dentist-turned-IPS officer whose people-centric policing, anti-drug initiatives, and youth...
By Lokeshwari Panthadi 2026-07-23 09:11:43 0 347
Andhra Pradesh
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా* నందిగామ,ఎన్టీఆర్ జిల్లా మదీనా...
By Patan Khuddus 2026-04-17 13:54:11 0 281
Telangana
చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు...
మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి...
By Krishna Balina 2025-12-14 23:33:52 0 332
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com