Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం.

0
366

 

 

 

Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం

24-03-2026 Tue 06:33 | Andhra

Megha Engineering Pipes Burned in Amaravati Fire Accident

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తుళ్లూరు మండలం రాయపూడి వద్ద భారీగా మంటలు ఎగసిపడ్డాయి. రాజధాని పనుల కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిల్వ ఉంచిన పైపులకు నిప్పంటుకోవడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 

సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, కొన్ని రోజుల క్రితమే వెలగపూడి సమీపంలో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన కోట్ల విలువైన పైపులు ఇలాగే అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించినప్పటికీ, ఆ దర్యాప్తు పూర్తికాకముందే ఇప్పుడు అదే తరహాలో మరో ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

వరుస ఘటనల నేపథ్యంలో ఇవి ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా లేక రాజధాని పనులను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలా అనే కోణంలో చర్చ మొదలైంది. కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్యం కూడా ఒక కారణమై ఉండవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఫోరెన్సిక్ బృందాల సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Rakesh Kanwar: Leading Himachal with Vision and Integrity
A distinguished 1993-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
By Lokeshwari Panthadi 2026-07-24 09:41:56 0 212
Telangana
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు :  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ...
By Sidhu Maroju 2025-11-27 08:01:04 0 211
Telangana
మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి...
By Ponnala Srinivasrao 2026-03-16 02:01:17 0 295
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ద్యేయంగా "ప్రజా దర్బార్"..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి తెలుగుదేశం పార్టీ...
By BABJI DADALA 2025-12-26 11:29:10 0 416
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలం గంటవాని పల్లె దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ పీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నసీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం   దోర్నాల మండలం గంటవాని పల్లె...
By Chennaiah Kati 2026-02-19 11:59:47 0 376
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com