కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

0
298

కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డి గారికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.  

‎ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూ కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. 

‎కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు.

‎తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి అని అన్నారు.

‎మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని తెలిపారు.

‎తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని తెలిపారు.

Search
Categories
Read More
Punjab
Punjab Launches Global Training Drive to Transform School Education
Chandigarh: Determined to create a world-class learning environment, the Bhagwant Singh Mann...
By BMA ADMIN 2025-05-20 07:53:40 0 2K
Telangana
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాస రావుకు ఘన నివాళులు అర్పించింది. లాస్...
By Ponnala Srinivasrao 2026-03-17 03:46:41 0 313
Andhra Pradesh
APSRTC ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ
APSRTC(PTD) ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్.(ఏఐటీయూసీ అనుబంధం).   రాష్ట్ర వ్యాప్తంగా...
By Rajini Kumari 2025-12-29 08:41:59 0 210
SURAKSHA
Shri Vivek Pandey, IAS: A Visionary Driving Administrative Excellence
A distinguished 2003-batch AGMUT cadre IAS officer whose people-centric governance,...
By Kalaga Sailaja 2026-07-29 12:05:42 0 107
Andhra Pradesh
Yekuntadwara Dharshanam
💥వైకుంఠ ఏకాదశి పర్వదినాన కుటుంబ సమేతంగా మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి...
By Pagadala Venkateswar 2025-12-30 07:59:44 0 292
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com