బాపట్ల. టౌన్ హాల్ .లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ మరియు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ..

0
609

బాపట్ల: బాపట్లలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రధమాంద్ర మహాసభ
 స్మారక విజ్ఞాన కేంద్రాన్ని భావితరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంనిర్మించాలి సమావేశం పిలుపు"
బాపట్ల టౌన్ హాల్ ప్రాంగణంలో ప్రథమాంధ్ర మహాసభ తెలుగు తల్లి పైలాన్ వద్ద. నవ్యాంధ్ర చైతన్య వేదిక . ఫోరం ఫర్ బెటర్ బాపట్ల. మరియు జన విజ్ఞాన వేదిక. సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి డాక్టర్ పి సి సాయిబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ. 113 సంవత్సరాల క్రితం. 1913లో ఇదే టౌన్ హాల్ ప్రాంగణంలో ఆనాడు ప్రధమాంద్ర మహాసభ.. చారిత్రాత్మకమైనది. ఆనాటి తెలుగు జాతి మహామహులు ఎందరో పాల్గొన్నారుఅన్నారు . అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ. ఫలితమే. ఆంధ్ర రాష్ట్ర సాధన. అన్నారు

జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం. నవ్యాంధ్ర చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు. .కోట వెంకటేశ్వర రెడ్డి. తెలుగు నాట ఆంద్రోద్యమం 5 దశలను వివరించారు . ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో . . 1913 లో. జరిగిన ప్రధమ. ఆంధ్రమహాసభ నుండి . నేడు . ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ 2026నేటి వరకు. జరిగిన 5 చారిత్రక దశలను వివరించారు. ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో. ఒక అస్తిత్వం లేని తెలుగు ప్రజలకు 1913లో బాపట్లలో  జరిగిన చారిత్రాత్మక ప్రధమ ఆంధ్ర మహాసభ ఒక అస్తిత్వాన్ని. స్ఫూర్తి నిచ్చింది. అన్నారు
అనంతరం ప్రతిఏటాఒకవైపు  ఆంధ్ర ప్రాంతంలో మరోవైపు నైజాం పాలనలోని తెలంగాణ ప్రాంతంలోనూ రెండు.తెలుగు ప్రాంతాల్లో ప్రతిఏటాజరిగిన చారిత్రాత్మక ఆంధ్రోద్యమం మహాసభలు తెలుగువారిలో భాష సాంస్కృతిక అస్తిత్వ ఉద్యమ చైతన్యం నింపాయి రెండవ దశలో ఆనాడు. మహాత్మా గాంధీ శిష్యుడుగా స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న పొట్టి శ్రీరాములు ఆంధ్ర ఉద్యమాన్ని అందుకొని అమరజీవి పొట్టి శ్రీరాములుఅయ్యారు.. 1952 లో మద్రాసులో 58 రోజులు ఆయన  చేసినమహాఆమరణనిరాహార దీక్ష ఆయన అమరత్వంతో మరో మలుపు తిరిగి 1953 లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆ తర్వాత మూడేళ్లకు 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 58 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాష్ట్రం 2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు నేడు 2026లో నవ్యాంధ్ర రాష్ట్రం అమరావతిరాజధానిగా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్నది  అమరావతి రాజధానిగా కేంద్రం ఇంకా చట్టం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు ఈ దశలో అమరావతిలో (తుళ్లూరు లో) 
అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం ఆయన 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా బాపట్లలో కూడా 1913లో బాపట్ల టౌన్ హాల్లో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ జరిగిన ప్రాంగణంలో ఆధునిక తెలుగుజాతి చరిత్రలో ఒక మహత్తర ఘట్టం అందుచేత బాపట్లలో టౌన్ హాల్ ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో  బాపట్లలో ప్రధమాంధ్ర మహాసభ  స్మారక విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు  ఇందుకు త్వరలో ఒకపూర్తిస్థాయి రూపకల్పన చేసేందుకు బాపట్ల పట్టణంలోని ప్రముఖులుతో పూర్తిస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరుగును సోదర ప్రజా సంఘాలను అధికారులను సమన్వయపరచుకొని. బాపట్ల ఎమ్మెల్యే గారితో సహాప్రజాప్రతినిధులను కలుసుకొని. ఒక రూపకల్పన చేయనున్నామని డాక్టర్ పి సి సాయిబాబు మరియు కోటా వెంకటేశ్వర్ రెడ్డి సంయుక్తంగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి. 125వ. జయంతి సందర్భంగాఘనంగా నివాళులర్పించారు 
ఈ కార్యక్రమంలో, డాక్టర్ పి సి సాయిబాబు, కోట వెంకటేశ్వర రెడ్డి, తటవర్తి వెంకట సుబ్బారావు,  హేమంత్ కుమార్, బి నరసారెడ్డి , చిలుకూరి శర్మ, నాగ సాయిబాబు, హేమంత్, ఆదిత్య, అమర్, శివసాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళా క్రీడాకారిణులకు ‘శక్తి టీం’ శక్తి యాప్ పై అవగాహన
చీరాల, మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు....
By Vadlamudi NagaVenkat 2026-06-11 10:16:39 0 354
Andhra Pradesh
పుంగనూరు: తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు
పుంగనూరు పట్టణంలో మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు....
By Kothuru Murali 2026-03-24 13:38:00 0 181
Telangana
విద్యుత్ శాఖలో అన్మాండ్ అనే విద్యుత్ ఉద్యోగి మృతి...
నర్సంపేట: విద్యుత్ షాక్తో యువకుడి మృతి భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలంలోని...
By Gujile Ramu 2026-08-12 10:31:49 0 173
Andhra Pradesh
చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళి
చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా...
By Kothuru Murali 2026-03-26 14:30:51 0 209
Telangana
"తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-04-28 13:09:15 0 647
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com