పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం

0
223

ప్రచురణార్థం.14/3/2026

విజయవాడ 

పునరావాసం క్రింద సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక 

 జి +3 అపార్ట్మెంట్స్  

పేద ప్రజల ఇళ్లకు అదానీ స్మార్ట్ మీటర్ల బిగించడం అన్యాయం 

 

51-52- రెండు అపార్ట్మెంట్స్ లో బిగించిన స్మార్ట్ మేటర్ లను తీసివేసి పాత మీటర్లు బిగించాలని 

కోరుతూ 

 

సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఎక్సెల్ ప్లాంట్ అపార్ట్మెంట్స్ వద్ద స్థానిక ప్రజలతో నిరసన కార్యక్రమం జరిగింది.

 

ఈ కార్యక్రమానికి చింతల శ్రీనివాస్ సిపిఎం నగర కమిటీ సభ్యులు 

అధ్యక్షత వహించారు.

 

బి రమణారావు 

సిపిఎం సెంట్రల్ సిటీ కమిటి కార్యదర్శి

కె దుర్గారావు  

కార్యదర్శి వర్గ సభ్యులు

పాల్గొని మాట్లాడుతూ 

 

వైసిపి అధికారంలో ఉండగా

స్మార్ట్ మీటర్లు పెడితే పగలకొట్టండి అని ప్రజలకు చెప్పిన టిడిపి కూటమి ప్రభుత్వం 

 

అధికారం చేపట్టిన ఆరు నెలలకే స్మార్ట్ గా బిగింపుకు కార్యక్రమం ప్రారంభించారని అన్నారు

సిపిఎం ఇతర ప్రజా సంఘాలు చేపట్టిన ఆందోళన ఫలితంగా 

 

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు స్మార్ట్ మీటర్లు ఇష్టం లేనివారు బిగించుకో అవసరం లేదని బలవంతంగా బిగించవద్దని ఆ శాఖకు ప్రజలకు చెప్పారు 

ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు

 

దశలవారీగా వ్యాపారస్తులకు మీటర్లు బిగిస్తూనే వస్తున్నారు 

 

వ్యాపారస్తులు బిగింపు అడ్డుకుంటే అదాని బృందం బెదిరింపులు కూడా చేసిన ఘటనలు ఉన్నాయి 

 

గుట్టు చప్పుడు కాకుండా దొంగ దారిలో మీటర్లు పాడైపోయిన కొత్తవి బిగిస్తున్నాము మీటర్ రీడింగ్ సరిగ్గా రాలేదు కొత్త మీటర్ పెట్టుకోండి అని నమ్మించి మోసపూరితంగా మీటర్లు బిగించటం సరైనది కాదన్నారు

 

G+3 ఇళ్ళు నగరంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఇళ్ళు తీసేసి

పునరావాసం కింద ఇచ్చినఇళ్ళు 

పేదవారు రోజువారి కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు

 

ఇప్పటికే సర్దుబాటు చార్జీలు ఇందనపు చార్జీలు యూజర్ చార్జీల పేర్లతో వందల రూపాయలు వీళ్ళ నెత్తిన రుద్ధి కాల్చుకున్న దానికంటే అదనంగా ఈ చార్జీల రూపంలో భారం మోస్తున్న పేద ప్రజలు

ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల ప్రయోజనాలను విస్మరించి, అదానీ, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు అత్యంత లాభాలు చేకూర్చే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని అన్నారు 

 

రాష్ట్రంలో అన్ని ఇళ్లకు వ్యాపారూలకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించి తద్వారా

అదానీ ఇతర కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చి పెట్టేందుకు ప్రభుత్వాలు 

చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతున్నారని తెలియజేశారు

 

బిజెపి, టిడిపి, వైసిపి జనసేన పార్టీలన్నీ విద్యుత్ అవినీతిలో,అదానీ దోపిడీలో పాలుపంచుకుంటు ప్రజలపై భారాలు వేస్తున్నాయి

 

 అదానీ, కార్పొరేట్ కంపెనీల దోపిడీని రక్షిస్తూ. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోనీ కూటమి ప్రభుత్వం ప్రజలపై బారాలు వేస్తున్నారు 

 

ఇప్పటికైనా విద్యుత్ అవినీతి, ఆధాని దోపిడీపై 

కూటమి ప్రభుత్వం

ముఖ్యమంత్రి స్పందించాలి, ప్రజలపై భారాలు వేయటం మానుకోవాలని డిమాండ్ చేశారు

 

 దొంగ చాటు బిగింపుని ఆపకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిపిఎం పార్టీ చేపడుతుందని హెచ్చరించారు

 

కార్యక్రమంలో 

సిపిఎం స్థానిక నాయకులు

 కొండలరావు 

ఎం వెంకటేశ్వరమ్మ. 

 

స్థానిక పెద్దలుప్రభుదాస్ 

ఎస్ కె అన్సర్ 

ఎస్ కె.సుభాని 

అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.

 

చింతల శ్రీనివాస్

సిపిఎం సెంట్రల్ సిటీ నగర కమిటీ సభ్యులు

Search
Categories
Read More
BMA
Visualizing Sound: Spectrographs Exposing Voice Fakes
When evaluating the likelihood that an audio file's contents have been altered, journalists now...
By JoinBMA 2026-08-21 18:05:31 0 343
Health & Fitness
Breakthrough Designation for Liver Disease Therapy
The landscape of metabolic health shifted significantly as the US FDA granted Breakthrough...
By Dunna Jessicaruth 2026-05-19 07:06:45 0 111
Andhra Pradesh
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
By Mobbu Venkatramana 2026-02-25 14:08:18 0 296
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు కొత్తూరు మురళిలో ఐదు దశాబ్దాల చరిత్ర గల జాతర నేటి నుంచి ప్రారంభం
పుంగునూరులో మంగళ, బుధవారాలలో ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా...
By Kothuru Murali 2026-03-10 15:42:20 0 187
Andhra Pradesh
కల్వర్టు అనుమతికి లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఏఈ.
నెల్లూరు జిల్లాలో ముగ్గురు నీటిపారుదల శాఖ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)...
By Pagadala Venkateswar 2026-08-28 05:56:04 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com