మా ఇంటి పెద్ద కొడుకు షార్ట్ ఫిలిం లాంచ్

0
236

*పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా 'మా ఇంటి పెద్ద కొడుకు' షార్ట్ ఫిలిం లాంచ్*  

 

-- అలాగే ఉద్యమి లిరికల్ సాంగ్ కూడా

-- నటీనటుల నటన, పొద్దున్నే సాంగ్ లిరిక్స్ అద్భుతం 

-- వీటిని నిర్మించిన జొన్న రాజేష్ ను ప్రశంసించిన హరిప్రసాద్*

 

*మంగళగిరి*

 

షార్ట్ ఫిల్మ్, లిరికల్ సాంగ్ ప్రారంభం*

-- లోకల్ టాలెంట్ తో అద్భుతంగా తీశారు -- ఏంఎల్ సి పిడుగు హరిప్రసాద్ 

--

 

జనసేన పార్ఠీ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి...? సభ్యత్వం తీసుకోవడం వల్ల కార్యకర్తకు జనసేన పార్ఠీ ఏవిధమైన అండగా ఉంటుంది అన్న ప్రధాన అంశంతో అత్యంత ఎమోషనల్ కథాంశంతో జనసేన పార్టీ మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సారథ్యంలో జనసేన సాధక్ జొన్నారాజేష్ నిర్మాత గా, గాదెనాగభూషణం రచన,దర్శకత్వంలో రూపొందిన "మాఇంటి పెద్దకొడుకు" షార్ట్ ఫిల్మ్, అలాగే జొన్న రాజేష్ నిర్మించిన జనసేన ఉద్యమిగా రండి మునుముందుకు అను లిరికల్ సాంగ్ ను జనసేన పార్టీ MLC పిడుగు హరిప్రసాద్ మంగళగిరి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో శనివారం నాడు లాంఛనంగా ప్రారభించారు.

 

జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తో కలసి "మాఇంటిపెద్దకొడుకు" షార్ట్ ఫిల్మ్ ను వీక్షించిన హరిప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం పిడుగు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ "మాఇంటిపెద్దకొడుకు" ఒక షార్ట్ ఫిల్మ్ చూసినట్టు లేదని ఒక కుటుంబ కథను అత్యంత సహజంగా రూపొందించారంటూ దర్శకుడు గాదెనాగభూషణం ను ప్రత్యేకంగా ప్రశంశించారు. అత్యంత అద్భుతమైన కథాంశంతో కళ్ళు చెమర్చేవిధంగా సన్నివేశాలున్నాయంటూ కొనియాడారు. ఉద్యమి సభ్యత్వం తీసుకున్న జనసైనికుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఏవిధమైన అండదండలు అందిస్తున్నదో కళ్ళకు కట్టినట్లు చూపించారన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర లోనటించి తన అత్యద్బుతమైన నటనతో ఆకట్టుకున్న ఉండవల్లిపార్ధసారధి తో పాటునటీనటులను, టెక్నీషియన్స్ ను హరిప్రసాద్ అభినందించారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని అలాగే జనసేన ఉద్యమి మెంబర్షిప్ పై స్పెషల్ లిరికల్ సాంగ్ నిర్మించిన సాధక్ జొన్నారాజేష్ ను హరిప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. లిరికల్ సాంగ్ తో పాటు షార్ట్ ఫిల్మ్ ను జనసేన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని తెలిపారు. 18 మెంబర్షిప్ సాంగ్ లిరిక్స్ రాసిన అమరావతి ఉద్యమ ప్రజా కళాకారు రమణను ప్రశంశించారు.

 

ఈ కార్యక్రమంలో చిల్లపల్లి శ్రీనివాసరావు, మండలి రాజేష్ ,పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధు, జనసేన నాయకులు మారుతీ రావు,

సాదు చంద్రశేఖర్,బడే కోమలి, కోటేష్ బాబు, విజయశేఖర్, సామల నాగేశ్వరరావు,వాసా శ్రీనివాసరావు, రాజా రమేష్, తంబీ,సాయి,,జనసేన నాయకులు,మా ఇంటి పెద్ద కొడుకు మూవీ టీం సభ్యులు శశి, మెండే నవీన్ బాబు, హర్ష, అఖిల్, పునీత్, శరత్ కుమార్ తదితరులు పాల్గున్నారు

Search
Categories
Read More
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:46:21 0 2K
Andhra Pradesh
స్వాతంత్ర్య సమరయోధుల కుమారులకు గణతంత్ర దినోత్సవం నాడు ఘన సన్మానం.
రామసముద్రం మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గంజి శ్రీనివాసరావు దేశానికి చేసిన సేవలకు...
By Pagadala Venkateswar 2026-01-27 07:15:14 0 205
Telangana
అగ్నివీర్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్/ హైదరాబాద్   నిరుద్యోగులకు మరోసారి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం....
By Sidhu Maroju 2025-08-02 18:37:23 0 1K
SURAKSHA
Adarsh Katiyar, IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "The true strength of policing lies in earning the trust of the people while...
By Fathima Safa 2026-07-20 14:05:46 0 357
Andhra Pradesh
విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను...
By Rajini Kumari 2025-12-16 09:38:25 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com