కొండపల్లి ఐడిఏ డ్రెస్ ఫ్యాక్టరీలో 200 కేజీల ఆల్ట్రా జోల స్వాధీనం

0
211

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

 

*కొండపల్లి ఐడిఏ లో డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున తయారీ..200 కేజీల అల్ప్రజోలాం స్వాధీనం*

 

*రూ 47 కోట్ల విలువైన మాదక పదార్థాలు పట్టివేత*

*హైదరాబాద్ కేంద్రంగా రా మెటీరియల్ సరఫరా…*

*ఇద్దరు నిందితులు పోలీస్ అదుపులో*

 

 

ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా నడుస్తున్న భారీ మాదక ఔషధ తయారీ కేంద్రాన్ని అధికారులు వెలికితీశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో సుమారు 200 కిలోల అల్పరాజోలుమ్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మాదక పదార్థం విలువ సుమారు రూ.47 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. డీఆర్ఐ అధికారుల సమాచారం మేరకు కొండపల్లి పరిశ్రమల ప్రాంతంలో ఎం ఎస్ రాస్ ఆర్గానిక్స్ పేరిట రహస్యంగా మాదక ఔషధ తయారీ జరుగుతున్నట్లు గోప్య సమాచారంతో గుర్తించారు. అనంతరం నిర్వహించిన దాడుల్లో భారీ పరిమాణంలో రసాయనాలు, యంత్రాంగం బయటపడింది.

 

*భారీగా కెమికల్స్, యంత్రాలు స్వాధీనం..*

 

కొండపల్లిలో జరిగిన దాడుల సమయంలో అధికారులు 2860 లీటర్ల వివిధ రకాల కెమికల్స్, 800 కిలోల రా సబ్స్టెన్స్, అలాగే డ్రగ్ తయారీకి వినియోగించే రియాక్టర్లు, డ్రైయర్లు, సెంట్రిఫ్యూజ్‌లు వంటి పరిశ్రమల యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన పదార్థాల పరిమాణాన్ని బట్టి కొంతకాలంగా ఇక్కడ భారీ స్థాయిలో ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

 

*ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకున్నారు*

 

ఈ కేసులో హైదరాబాద్ బొల్లారానికి చెందిన కనుమూరి సాయి త్రిభువన్ వర్మ, సౌరబ్ కుమార్లను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఫార్మా రంగానికి చెందిన అనుభవాన్ని ఉపయోగించి అక్రమంగా ఆల్ప్రజోలాం తయారీ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

 

*ఫార్మా అనుభవం ఉన్న వ్యక్తి కీలక పాత్ర..*

 

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఫార్మా రంగంలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రా మెటీరియల్ సమకూర్చి కొండపల్లిలో తయారీ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ఎజెండాను అమలు చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన...
By Kothuru Murali 2026-02-06 12:53:09 0 187
SURAKSHA
Tamil Nadu Police Green Drive Plants Thousands of Trees Every Year
Tamil Nadu Police contributes to environment through tree plantation drives. Officers and...
By Kalaga Sailaja 2026-07-02 08:20:04 0 123
Telangana
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్...
By Pinnehasan Odela 2026-01-19 11:13:05 0 357
West Bengal
Free Bus Travel For Women & Annapurna Yojana Launched
The West Bengal government announced a massive welfare push today by approving free bus travel...
By Dunna Jessicaruth 2026-05-18 10:52:19 0 142
Telangana
జర్మనీ సహా విదేశాల్లో ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న టామ్కామ్: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 13: నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు...
By Avunoori Mahesh 2026-05-13 10:27:15 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com