గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం

0
243

గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం

 

 గోదావరిఖని ప్రాంతంలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోదావరిఖని హనుమాన్ నగర్‌కు చెందిన రేగుల వెంకటేష్ అనే వ్యక్తి పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తేది 10-03-2026 రోజున ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి లక్ష్మీ నగర్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు తన బండి నెంబర్ TS 22 5029 గల ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్‌పై వెళ్లి, కాంప్లెక్స్ వెనుక భాగంలో బండిని పార్క్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్లాడు.

 

కొద్ది సేపటి తర్వాత తిరిగి వచ్చి చూడగా, అక్కడ పార్క్ చేసిన బండి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా దొరకలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు తన బండిని దొంగిలించారని రేగుల వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఫిర్యాదు అందుకున్న వెంటనే ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై మనోహర్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దర్యాప్తులో బైక్‌ను దొంగిలించిన వ్యక్తిని గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి బైక్‌ను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై మనోహర్ వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మొహరం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం...
By Benguluri Madhubabu 2026-06-26 06:21:22 0 157
Andhra Pradesh
ప్రభుత్వ పథకాలను ప్రజల్లేకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం రాయచోటి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-18 06:15:05 0 270
Telangana
దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా...
By Sidhu Maroju 2025-07-02 09:32:27 0 1K
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్‌లో HPV వ్యాక్సిన్ ప్రారంభం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య...
By Sidhu Maroju 2026-03-30 09:53:14 0 187
Telangana
జగిత్యాల : కన్నతల్లిని హత్య చేసిన కొడుకు..!
జగిత్యాల మల్లాపూర్ కేంద్రంలో వృద్ధులైన కన్నతల్లిని ఒక కొడుకు హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం...
By Sunka Santhosh 2026-04-11 04:53:51 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com