అల్వాల్ ల్లో మైనర్ బాలికపై అత్యాచార కేసు- నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాఘార శిక్ష.|

0
228

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.

కేసు వివరాల్లోకి వెళ్తే..

2024లో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్.జి. నారాయణ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు క్రైమ్ నంబర్ 275/2024 కింద ఐపిసి సెక్షన్లు 376(2)(d), 376(3) మరియు పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణను చేపట్టిన మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెంకటేష్ , ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు నారాయణను దోషిగా నిర్ధారించారు. 

దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించారు.

అలాగే, బాధితురాలికి ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. ప్రభాకర్ రెడ్డి సమర్థవంతంగా వాదనలు వినిపించారు. 

ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ లోతుగా దర్యాప్తు చేయగా, అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ (SHO) ప్రశాంత్ కేసు పురోగతిని పర్యవేక్షించారు. 

కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ పి. ఉప చారి సాక్షుల హాజరు, కోర్టు సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ శిక్ష ఒక హెచ్చరిక అని పోలీసు అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
వరసగా మ హిళా దినోత్సవము లు
రెండో రోజు కొనసాగు తున్న మహిళా దినోత్సవం భాగంగా విశాఖ కలెక్టరేట్‌లో రెవిన్యూ భవన్ ప్రాంగణంలో...
By Mobbu Venkatramana 2026-03-07 12:12:09 0 474
Andhra Pradesh
రాత్రిపూట వాహనాలపై అదనపు LED లైట్లు… ప్రమాదాలు పెరిగిపోతున్నాయి!
ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించాలని ప్రజా గ్రహాలు హైదరాబాద్/విజయవాడ, సెప్టెంబర్ 4 (భారత్ ఆవాజ్):...
By VALLERU SIMHADRI 2026-09-04 13:15:17 0 222
Telangana
కరీంనగర్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యాజమాన్యం.
కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్కూళ్లు జూన్ 15న...
By Thalakokkula Sadanandam 2026-06-11 17:48:25 0 388
Andhra Pradesh
పుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు....
By Kothuru Murali 2026-01-24 12:11:37 0 230
Haryana
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in Gurugram
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in...
By BMA ADMIN 2025-05-22 05:31:01 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com