నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు - ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్.

0
554

పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ హెచ్చరించారు. స్థానిక స్టోన్ హౌస్ పేట ప్రాంతంలోని ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలు, గోదాములపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో 800 కేజీలు నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు.దుకాణాల యజమానులకు 3 లక్షల 20 వేల రూపాయల జరిమానా విధించి, మరోసారి నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు జరిపితే దుకాణాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు.నిషేధిత ఉత్పత్తుల తయారీ, రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చట్టవ్యతిరేకమైన చర్యలని ప్రజలంతా అవగాహన పెంచుకుని, బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. నిషేధిత ఉత్పత్తులపై తమకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ తెలియజేసారు. ఈ దాడుల్లో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ.
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్...
By Pagadala Venkateswar 2026-01-28 10:02:51 0 184
BMA
Biometric Bias: Facial Recognition Falsely Profiles Youth
Law enforcement agencies increasingly deploy automated facial recognition technology in urban...
By JoinBMA 2026-08-25 07:01:44 0 141
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Strengthens Industrial Growth and Investment
Dadra & Nagar Haveli and Daman & Diu continue to emerge as an important industrial...
By Fathima Safa 2026-07-06 06:10:17 0 173
Telangana
గంగోత్రికి వెళ్తున్నారా. ఈ రూల్స్ పాటించాల్సిందే
చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రిలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయ కమిటీ కొత్త రూల్...
By MERIGE MALLESH 2026-04-22 11:21:10 0 726
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-02-19 06:54:12 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com