మహిళల మాన ప్రాణాలకు భద్రత లేదా. - జిల్లాలో శాంతిభద్రతలు కరువు. - కూటమి పాలనలో రక్షణ లేని రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం - పూజిత.

0
680

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్  కాకాణి పూజిత.ఈ సందర్భంగా పూజితమ్మ మాట్లాడుతూ ఇటీవల గుమళ్ళ దిబ్బలో మైనర్ బాలికపై జరిగిన దాడి మరువకముందే వరిగొండలో మరో మైనర్ బాలికపై దాడి జరగడం దారుణం.గుమ్మళ్ళ దిబ్బలో మైనర్ బాలిక ఘటనలో పోలీస్ లు, ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, బాధితులకు న్యాయం చేయాలని పోరాడిన వారి మీద కేసు నమోదు చేశారు.మైనర్ బాలిక విషయంలో అండగా నిలిచిన వారి మీద కేసులు పెట్టేందుకు పోలీసులు చూపిన శ్రద్ధలో పదో వంతు విధుల నిర్వహణలో పెట్టి ఉంటే వరిగొండలో మరో దారుణం జరిగి ఉండేది కాదు.కూటమి పాలనలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతుంటే వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, అరికట్టేందుకు ప్రయత్నించడం లేదు.వరిగొండలో మైనర్ బాలికపై జరిగిన దాడిని పోలీసులు ఎంత దాచి పెట్టాలనుకున్నా, దాగలేదు. మైనర్ బాలిక  పై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకుని ఆ బిడ్డను,కుటుంబాన్ని, పరామర్శించడానికి మేము వెళితే పోలీసులు బిడ్డను దాచేశారు .మైనర్ బాలిక  గురించి ఆసుపత్రి సిబ్బందిని అడిగితే ఒకరికొకరు సంబంధం లేకుండా తమకు తెలియదు అంటూ సమాధానం చెప్పారు.హాస్పటల్ హెచ్ ఓ డి గీతాలక్ష్మీ ని సంప్రదించి పాప గురించి వివరాలు అడిగితే మైనర్ బాలిక పేరు చెప్పాలని పదేపదే అడిగారు.ఫోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక పేరు వెల్లడించకూడదని మేము చెబుతున్నా, మా నోటి నుండి ఆ పాప పేరు రాబట్టేందుకు ప్రయత్నం చేశారు, ఎందుకో నాకు అర్థం కాలేదు.బాధ్యత కలిగిన డాక్టర్ వృత్తిలో ఉన్న గీతా లక్ష్మీ కి మైనర్ బాలిక పేరు వెల్లడించకూడదని కనీసం తెలియకపోవడం దురదృష్టం.
గీతా లక్ష్మి  మైనర్ బాలిక గురించి  తెలియలేదు అంటూ బాధ్యతారహిత సమాధానం చెప్పారు .ఐదో తారీకు హాస్పిటల్ లో మైనర్ బాలిక  చేరితే  డాక్టర్లకు సిబ్బందికి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.మైనర్ బాలిక కు ఏమైందో, ఏ పరిస్థితుల్లో ఉందో చూడాలని హాస్పిటల్ లో గంటసేపు తిరిగాం ఎక్కడా కనిపించలేదు .చివరకు పోలీసులు ఒక స్టేట్మెంట్ పాస్ చేసి, మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరగలేదు,  టీవీ దొంగతనానికి వెళితే అడ్డుకున్నందుకు పాపకు గాయాలయ్యాయని చెప్పారు.ఒక సీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో అఘాయిత్యం జరిగిందని రాశారు, మరో సీఐ అఘాయిత్యం జరగలేదు దొంగతనానికి వచ్చారని చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.పోలీసుల అసమర్ధతను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు.కూటమి నాయకుల సొంత లాభాల కోసం బాలిక కుటుంబ సభ్యులను దాచిపెట్టారు, నిజాన్ని మీరు దాచాలన్నా దాగదు, బయటకు వస్తుంది.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల లోపలే గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని శపథం చేశాడు.పచ్చని పల్లెల్లో గంజాయి, మద్యం వల్ల చిన్నారుల జీవితాలు చిదిగిపోతున్నాయి .జిల్లాలో మైనర్ బాలికలపై వరుస అఘాయిత్యాలు చోటు చేసుకోవడంతో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు.మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఇదివరకే నెల్లూరులో ఒకటవ నగరం పోలీస్ స్టేషన్లో  గంజాయి కేసు నమోదు అయ్యిందని ముద్దాయే  స్వయంగా ఒప్పుకున్నాడు.మైనర్ బాలిక విషయం బయటకు రావడంతో దిద్దుబాటు చర్యల్లో  భాగంగా కృష్ణపట్నం సిఐను, ముత్తుకూరు ఎస్ఐ ను సస్పెండ్ చేశారు.మైనర్ బాలిక విషయంలో పోలీసులు తప్పు చేశారు కాబట్టే సస్పెండ్ చేశారు.సిఐ,ఎస్ఐ,లు చిత్తశుద్ధితో పనిచేసే ఉండి ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగి ఉండేటివి కావు.మైనర్ బాలిక విషయంలో ఇలాంటి సంఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారులను కేవలం సస్పెండ్ చేయకుండా శాశ్వతంగా విధుల్లో నుండి తొలగించాలి.అసలు ఈ కేసులో విచారణకు వెళ్లిన ఇన్చార్జి   సిఐని ఎందుకు ఎస్పీ  సస్పెండ్ చేయలేదు .బాలిక విషయంలో తప్పును కప్పిపుచ్చిన ఇన్చార్జి సీఐని ముందు సస్పెండ్ చేయాలి.ప్రజలు అన్ని గమనిస్తున్నారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు.జిల్లాలో శాంతిభద్రతలు కరువయ్యాయి ఇకనైనా వైయస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం మాని,మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ ని, హోంమంత్రి అనిత ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.పరిపాలన  ఏవిధంగా చేయాలి, మహిళలకు రక్షణ ఎలా కల్పించాలో జగనన్నను చూసి నేర్చుకోవచ్చు  మహిళలకు ​జగనన్న హయాంలో దిశా యాప్ శక్తిగా మారింది​.దిశ యాప్ ద్వారా భద్రత - చట్టాల ద్వారా గౌరవం, రిజర్వేషన్ల ద్వారా రాజ్యాధికారం జగనన్న మనకు కల్పించారు.మైనర్ బాలిక కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల  అండగా నిలుస్తుంది.మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం, ఎక్కడా వెనకడుగు వేయం అని తెలిపారు. ఈ సమావేశంలో  వైఎస్ఆర్ సీపి జోనల్ మహిళా అధ్యక్షురాలు మోయిళ్ల గౌరీ , వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునంద , రూరల్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి , వైఎస్ఆర్సిపి సర్వేపల్లి మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి , దువ్వూరు సర్పంచ్ కృష్ణవేణి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీగా మోహరించిన పోలీసులు. |
    హైదరాబాద్ : ఇవాళ  ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ (ఓడియన్...
By Sidhu Maroju 2026-01-09 07:18:49 0 248
Telangana
పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి...
By Pindikura Mahesh 2026-05-30 03:11:39 0 169
Rajasthan
Rajasthan Accelerates Digital Governance for Better Services
Rajasthan continues to strengthen its digital governance ecosystem by expanding online public...
By Fathima Safa 2026-07-03 04:24:20 0 91
Tripura
Tripura Healthcare: Debate Over Doctors' Private Practice Ban
The government's recent prohibition on private practice for doctors at GB Pant Hospital and...
By Lokeshwari Panthadi 2026-07-03 04:33:21 0 98
Telangana
ఆ రోడ్డు వేసింది ఎవరో తేల్చండి?.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చివేత, రోడ్డు...
By Ponnala Srinivasrao 2026-03-15 02:41:18 0 340
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com