మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్

0
375

*మహిళా ద్రోహి జగన్*

 

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్

* వైసీపీ హయాంలో మహిళల పట్ల ఎన్నో దాష్టీకాలు 

* నిండు సభలో తల్లిలాంటి భువనేశ్వరిని దూషించారు...

* తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తివి నువ్వు

* చంద్రబాబును విమర్శించే అర్హత నీకు లేదు

* జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం

* వైసీపీ ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచి భారం పెంచితే...

* మేము మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి వెన్నుదన్నుగా నిలిచాం

* ఆ 5 ఏళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదు..

* ఆ ప్రాంత చెరువుల్లో నీటిని కూడా నింపలేని జగన్

* రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబు : మంత్రి సవిత

 

*పెనుకొండ/శ్రీసత్యసాయి* : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోంది... మహిళలను సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. అయిదేళ్లలో జగన్ బస్సు ఛార్జీలు పెంచితే, మేం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి మహిళలకు అండగా నిలిచాం... సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి... ఆయనను విమర్శంచే అర్హతే నీకు లేదు... నువ్వు మహిళా ద్రోహి’ అని జగన్ పై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అని విరుచుకుపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తి రాష్ట్రంలో ఇతర మహిళలను ఉద్ధరిస్తారని ఎవరూ భావించడలేదని జగన్ నుద్దేశించి విమర్శించారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సాధికారత గురించి ఆలోచించింది మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీర అంబేద్కర్, అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబేనని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. దీపం పథకం ద్వారా ఏడాదికి ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళను పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశమిస్తున్నారని అన్నారు. 

 

*తల్లిని, చెల్లిని గౌరవించని జగన్...*

 

సీఎం చంద్రబాబునుద్దేశించి జగన్ విమర్శించడంపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవాలయం లాంటి శాసనసభలో తల్లిలాంటి భువనేశ్వరిని జగన్, ఆయన బ్యాచ్ అవమానించిందన్నారు. సొంత చెల్లికి, తల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. బాబాయ్ కూతురైన మరో చెల్లి న్యాయం చేయాలని అడిగినా పట్టించుకోకుండా కోర్టులు చుట్టూ తిప్పుతున్న ప్రబుద్ధుడు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లి, పులివెందులలో మహిళలపై జరిగిన అత్యాచారాలను, దారుణాలను ప్రజలంతా చూశారన్నారు. రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల జగన్ ఏవిధంగా ప్రవర్తించాడో ఎవరూ మరిచిపోలేదన్నారు. ప్రశ్నించిన మహిళలపై కేసులు పెట్టి వేధించిన చరిత్ర ఆయనదన్నారు. ఆయన హయాంలో జరిగిన విధ్వంసం, ఘోరాలపై ఆనాడే గవర్నర్ కు ఒక పుస్తక రూపంలో అందజేశామని గుర్తు చేశారు. అయిదేళ్లలో బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై జగన్ భారం పెంచితే, తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వెన్నదున్నుగా నిలిచిందన్నారు. జగన్ మహిళా ద్రోహి అని మంత్రి సవిత విరుచుకుపడ్డారు. 

 

*రాయలసీమను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే*

 

అయిదేళ్ల పాలనలో దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా జగన్, ఆయన బ్యాచ్ కాలం గడిపిందని మంత్రి సవిత మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదని స్పష్టంచేశారు. అయిదేళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టారా... చెరువులను నీటితో నింపారా..? అని ప్రశ్నించారు. రాయలసీమను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్, పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తున్నారన్నారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తుండడంతో ఉపాధి కోసం వలసలు పోకుండా, తమ కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకోవడ చూసి, రాయలసీమ ప్రాంత తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీని ప్రజలెప్పుడో డైవర్షన్ చేశారని, వారి మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదని మంత్రి సవిత తెలిపారు. 

 

 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
సాధారణ వ్యక్తిలా.. హోటల్లో టిఫిన్ చేసిన బేబినాయన
ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే బేబినాయన సాధారణ వ్యక్తిలా హోటల్కు వెళ్లి టిఫిన్...
By Boiena Rajesh 2026-03-09 02:13:21 0 229
Telangana
హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|
హైదరాబాద్ – పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ...
By Sidhu Maroju 2025-12-23 11:59:58 0 303
Andhra Pradesh
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాం
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాంలో జరుగుతున్న ఎన్యుమరేషన్,డిజిటలైజేషన్...
By Chennaiah Kati 2026-07-12 13:19:52 0 129
Andhra Pradesh
ఎమ్మెల్యే జన్మదినం: టీడీపీ నాయకుడి శుభాకాంక్షలు.
మదనపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు కందికట్ల జయ,...
By Pagadala Venkateswar 2026-02-01 10:46:01 0 202
Andhra Pradesh
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ  కేంద్ర ఆరోగ్య,
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ...
By SivaNagendra Annapareddy 2025-12-28 05:12:49 0 671
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com