Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు.

0
193

 

Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు

10-03-2026 Tue 12:42 | Andhra

 

Janasena Formation Day Celebrations Cancelled

ఈ నెల 14న పిఠాపురంలో జరగాల్సిన వేడుకల రద్దు

ఎండల తీవ్రత, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం

జిల్లా, నగర, మండల కేంద్రాల్లో స్థానికంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలన్న పవన్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ప్రణాళికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 14న పిఠాపురంలో భారీ ఎత్తున వేడుకలను నిర్వహించాలని జనసేన తొలుత నిర్ణయించింది. అయితే, ఆ వేడుకలను రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వాతావరణ పరిస్థితులపై అందిన నివేదికలను దృష్టిలో ఉంచుకుని జనసైనికుల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

 

 

 

తొలుత పిఠాపురం వేదికగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావించినప్పటికీ, ప్రతికూల వాతావరణం దృష్ట్యా వ్యూహం మార్చారు. రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభకు బదులుగా, ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా, నగర, మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ స్థానికంగానే ఘనంగా నిర్వహించాలని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. మార్చి 14 అనేది జనసైనికులకు, వీర మహిళలకు ఒక పండగలాంటి రోజని, ఆ ఉత్సాహం తగ్గకుండా స్థానిక స్థాయిలోనే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

 

 

పిఠాపురంలో భారీ సభ రద్దు కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన కార్యాలయాలు పండుగ వాతావరణానికి సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ జెండా ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలతో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
SURAKSHA
Combating Cyber Fraud: Lakshadweep’s 1930 Helpline Guide
n era of rising digital threats, the Lakshadweep Police are taking proactive steps to protect...
By Lokeshwari Panthadi 2026-07-03 07:55:20 0 239
Andhra Pradesh
దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు
*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*    *Jan 21st, 2026*  ...
By Rajini Kumari 2026-01-21 14:58:53 0 207
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 82
Telangana
ప్రజల సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ద్రుష్టి.|
"రాంనగర్, జే.జే.నగర్‌లో పర్యటన.. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని హామీ" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-08 14:57:27 0 161
Telangana
"తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో...
By Sidhu Maroju 2026-05-17 14:41:07 0 380
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com