గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలుకి బ‌న్నీ ఆర్థిక సాయం

0
210

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గత నెల 28న జరిగిన బాణసంచా తయారీ కేంద్రం అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలిన మానసిక దివ్యాంగురాలు కడింపల్లి దుర్గ దీనస్థితి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హృదయ విదారక గాథపై స్పందించిన టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, ఆమెకు అండగా ఉంటానని మాట ఇచ్చారు.దుర్గ పోషణ కోసం తన వంతు సహాయంగా జీవితాంతం ప్రతి నెలా రూ. 7,500 ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. బన్నీ వాసు పర్యవేక్షణలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు నేరుగా దుర్గ నివాసానికి వెళ్లి, ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ ఆర్ధిక సహాయం అందించడంతో పాటు, భవిష్యత్తులోనూ ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న ఒక దివ్యాంగురాలికి అండగా నిలిచి అల్లు అర్జున్ తన గొప్ప మనసును చాటుకోవడంతో అభిమానులు మరియు స్థానికులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి...
బాపట్ల: మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని...
By Gadiyapudi Narendra 2026-01-20 12:27:21 0 247
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి....
By Kothuru Murali 2026-01-26 07:07:12 0 265
Andhra Pradesh
Chandrababu: ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో...
By Pagadala Venkateswar 2026-04-01 05:00:06 0 181
SURAKSHA
: Karnataka PoliceFrontline Heroes Du ring Flood Relief Operations
Content 90 words: During floods and heavy rains, Karnataka Police acts as first responders. They...
By Kalaga Sailaja 2026-07-01 10:53:12 0 194
Andhra Pradesh
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశం
విజయవాడ    విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
By Rajini Kumari 2026-04-08 16:19:28 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com