అంగన్వాడి కార్యకర్తలతో ముఖాముఖి చర్చలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
219

*అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*అంగన్వాడి కార్యకర్తలతో....ముఖాముఖిగా సమావేశమైన ఎమ్మెల్యే*

 

*తమ సమస్యలను ఎమ్మెల్యే రాముకు వివరించిన... అంగన్వాడి కార్యకర్తలు*

 

*అంగన్వాడీ సోదరీమణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా:ఎమ్మెల్యే రాము*

 

*అంగన్వాడి సోదరీమణులకిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం:ఎమ్మెల్యే రాము*

 

*గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో... వేతనాల పెంపు సమస్య కొంత ఆలస్యం:ఎమ్మెల్యే రాము*

 

*సీఎం చంద్రబాబు హయాంలోనే... అంగన్వాడీల జీతాలు పెరిగాయి: ఎమ్మెల్యే*

 

*తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపిన....అంగన్వాడి కార్యకర్తలు*

 

గుడివాడ మార్చ్ 09: రాష్ట్రంలో అంగన్వాడీ సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. 

 

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలతో ఎమ్మెల్యే రాము ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా.... వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు.ఆర్థిక ఇబ్బందులతోనే వేతనాల పెంపు కొంత ఆలస్యం అయ్యిందని... ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపినట్లు ఎమ్మెల్యే రాము సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పారు. 

 

పెద్ద మనసుతో తమ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాముకు సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు.

 

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఏపీలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడి సోదరీమణులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగానే , అంగన్వాడీల జీతాల పెంపు సమస్య పరిష్కారం కొంత ఆలస్యం అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే గతంలో అంగన్వాడీల జీతాలు పెరిగాయని, మరే ప్రభుత్వం వారి జీతాలు పెంచలేదని ఎమ్మెల్యే రాము గుర్తు చేశారు.

అంగన్వాడి సోదరీమణుల కష్టం గుర్తించిన ఏకైక ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే అని ఎమ్మెల్యే రాము ఉద్ధాటించారు.

 

 

ఈ సమావేశంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Bill Gates: బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం.
ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్ బిల్ గేట్స్ ‌కు స్వాగతం...
By Pagadala Venkateswar 2026-02-16 05:08:10 0 231
Andhra Pradesh
నీట్ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు
మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి...
By Boiena Rajesh 2026-02-26 15:07:12 0 243
Andhra Pradesh
బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పించాలి: AISF.
మదనపల్లి బీటీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించాలని AISF మాజీ రాష్ట్ర కార్యదర్శి జల్లా...
By Pagadala Venkateswar 2026-06-08 15:54:26 0 123
Telangana
New BJP State Leaders Meet Chief in Hyderabad.|
Hyderabad : Newly elected BJP State Committee members Chintala Manikya Reddy, Srinivas Varma, and...
By Sidhu Maroju 2026-04-01 18:19:41 0 288
Telangana
రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,...
By Sidhu Maroju 2025-09-22 15:18:42 0 336
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com