కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్

0
347

*కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*

 

  *కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతికుమార్‌*

 

               తెలుగుదేశం పార్టీ ఇన్ని దపాలు అధికారంలోకి వస్తుందంటే దానికి కారణం కార్యకర్త శ్రమేనని, అటువంటి కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్‌ తెలిపారు.

 

               శనివారం ఉదయం అయ్యప్ప నగర్ కిషోర్ ఆర్థోపెడిక్ హాస్పటల్ నందు చికిత్స పొందుతున్న 8వ డివిజన్ కి చెందిన టిడిపి కార్యకర్త రెడపొంగు జై హిందరావును టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చు నిమిత్తం సొంత నిధుల నుంచి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

 

             ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ కోసం చేసిన సేవలను పార్టీ ఎప్పటికీ మరవదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటుందని చెప్పారు. వైకాపా నాయకత్వం మాత్రం కార్యకర్తలను రెచ్చగొట్టి, వారిని ఇబ్బందులకు గురిని జైల్ల పాలు చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ ప్రజలకు మంచి చేసే స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. వైకాపా పార్టీ రెచ్చగొట్టే రాజకీయాలు, కుట్రలతోనే ముందుకు వెళ్తోందని ఆరోపించారు. తమ పార్టీ వైద్య సహాయం అవసరమైన కార్యకర్తలకు ఎన్టీఆర్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ వ్యక్తిగతంగా అండగా నిలుస్తున్నారని చెప్పారు.

 

              ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, కొత్తపల్లి రమేష్, మల్లెల రామకృష్ణ, మెరకనపల్లి నాగేశ్వరావు, బద్దురి వీరారెడ్డి, హయత్ ఖాన్ తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పైన నమోదైన ఫోక్సో కేసు పైన స్పందించిన భారత రాష్ట్ర సమితి...
By Ponnala Srinivasrao 2026-05-10 03:06:30 0 251
Andhra Pradesh
ములకలచెరువు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.
శుక్రవారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో రెడ్డెంవారిపల్లికి చెందిన రైతు...
By Pagadala Venkateswar 2026-06-27 05:53:29 0 96
Telangana
నిజామాబాద్
ఈరోజు మన 5వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో జెండా ఎగరవేయడం జరిగింది.    ఈ పవిత్ర...
By Sadaq Sadaq 2026-08-15 08:17:21 0 135
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి విక్రేతలపై పోలీసుల ఉక్కుపాదం. తిర్యాణిలో 9 మంది ముఠా అరెస్ట్
🎤కుమురం భీం అసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యప్తంగా...
By Chunarkar Jagadeesh 2026-07-27 16:03:09 0 289
Andhra Pradesh
44వ జాతీయ యోగి చాంపియన్ షిప్ 2025-2026 ప్రారంభోత్సవం
జిల్లేలమూడి శ్రీ వీళ్ళు జనని పరిషత్ అమ్మ వారి ప్రాంగణంలో ఘనంగా ప్రారంభీంచారు.ఈ కార్యక్రమం లో...
By Karapati Gopi 2025-12-27 12:21:16 0 766
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com