నల్లమోతువారిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంతోష దాయకం..... ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు*

0
770

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయుటకు విచ్చేసిన బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు.  

షుమారు 10 లక్షల రూపాయలు గ్రామంలో సిమెంట్ రోడ్లు కొరకు అదేవిదంగా మరో 7 లక్షల రూపాయల (షుమారుగా) నిధులను హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు కేటాయించినందుకు ఆ గ్రామ ప్రజా ప్రతినిధిగా గ్రామస్తులు అందరి తరుపున శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు.  

గ్రామభివృద్ధి కోసం నిధులు కేటాయించినందుకు తాండ్ర సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ స్వాగతించాలి అని కోరారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివ సాంబి రెడ్డి తో పాటు ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియ జేసిన ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు.  

కార్యక్రమంలో కర్లపాలెం తశీల్దార్ శ్రీదేవి, ఎంపిడిఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపిడిఓ లు శ్రీనివాసరావు,పద్మావతి లు, సెక్రెటరీ షేక్ షాహిన్, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ మర్రి ఆషా అశోక్, టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన గ్రామ పార్టీ ఇంచార్జ్ లు మునిపల్లి చిన్నా, గరిగంటి శ్రీనివాసరావులు, కుంటా రత్న బాబు,తాండ్ర శేషగిరి, బీసాబతుని గోపి, తాండ్ర శ్రీనివాసరావు,మొదలగు గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ నాయకులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ రాష్ట్ర సీనియర్ యువ నాయకులు కట్ట దొరస్వామి నాయుడు,...
By Pagadala Venkateswar 2026-04-16 12:31:00 0 164
Andhra Pradesh
ప్రభుత్వ హాస్పిటల్లో 35 లక్షల అల్ట్రాసౌండ్ ల్యాబ్ ప్రారంభం
నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో రూ.35 లక్షల అల్ట్రా సౌండ్ ల్యాబ్ ప్రారంభం.  ...
By Rajini Kumari 2025-12-27 10:29:47 0 237
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్...
By Boya Dasthagiri 2026-05-20 12:14:20 0 237
Andhra Pradesh
పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు
పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని...
By Kothuru Murali 2026-03-02 12:33:11 0 188
Andhra Pradesh
గ్రీన్ వుడ్ హై స్కూల్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
బెంగళూరులోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ...
By Kothuru Murali 2026-04-11 06:38:10 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com