తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

0
1K

తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా రాత్రిపూట బయటకు రావడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం నివారించాలని తెలిపారు. చిన్నపిల్లలు మరియు పశువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

అటవీశాఖ అధికారులు గ్రామ పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచి పులిని పట్టుకునేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ టౌన్ సీఐ బాలాజీ వరప్రసాద్‌పై బదిలీ వేటు. కొత్త సీఐగా నీలం రవి
ఆసిఫాబాద్, జూలై 25 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో...
By Chunarkar Jagadeesh 2026-07-25 10:06:21 0 258
Andhra Pradesh
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-20 14:05:57 0 246
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:45 0 172
Andhra Pradesh
మీ భూసమస్యకు స్వస్థ పరిష్కారం చూపటమే మా లక్ష్యం- జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు
"మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే మా లక్ష్యం" – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు...
By Chennaiah Kati 2026-06-22 06:07:49 0 106
Chhattisgarh
Chhattisgarh: Emerging Hub for Academic Excellence
July 2026 is witnessing a surge in intellectual activity across Chhattisgarh, with cities like...
By Lokeshwari Panthadi 2026-07-02 04:39:35 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com