తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

0
1K

తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా రాత్రిపూట బయటకు రావడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం నివారించాలని తెలిపారు. చిన్నపిల్లలు మరియు పశువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

అటవీశాఖ అధికారులు గ్రామ పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచి పులిని పట్టుకునేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జీడి మామిడి తోటల్లో ఏనుగుల సంచారం
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల...
By Boiena Rajesh 2026-04-28 03:03:43 0 221
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 339
Jammu & Kashmir
Border Vigil Tightened: White Knight Corps Reviews Security in Poonch-Rajouri
Following the discovery of a militant hideout and the recovery of IED batteries in Rajouri, the...
By Dunna Jessicaruth 2026-05-14 07:49:14 0 108
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన గుంటూరు...
By Pagadala Venkateswar 2026-02-11 09:19:01 0 182
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*   సీఎం చంద్ర‌బాబు జీవిత‌మే ఒక...
By Rajini Kumari 2025-12-30 12:29:18 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com