చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం

0
562

చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించారు. ఏఐటియూసీ యూనియన్ మద్దతుతో జరిగిన ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఎదురవుతున్న సమస్యలపై, ముఖ్యంగా నివాస స్థలాల విషయమై ఈ సందర్భంగా చర్చించారు.

ప్రభుత్వానికి విన్నపం "మాకు సొంత ఇల్లు కావాలి"

ఈ సమావేశంలో దివ్యాంగుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది దివ్యాంగులకు నివసించడానికి కనీసం సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు స్థానిక శాసనసభ్యులు మద్దూలూరి మాలకొండయ్య వెంటనే స్పందించి, దివ్యాంగులందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

నూతన కమిటీల ఎన్నిక

దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీలను ఎన్నుకున్నారు

ప్రధాన కమిటీ:

 

 కన్వీనర్: నూకతోటి దత్తాత్రేయ సహాయక కన్వీనర్: యనమల నాగేశ్వరరావు

 అధ్యక్షుడు: పెరికల జోసెఫ్

 సెక్రటరీ: మంత్రు నాయక్

 

 సహాయక కార్యదర్శులు: 

 

మంకెలా ప్రకాష్, పర్వతల ఈశ్వరరావు, వెంకట్రావు, బొందు గురవయ్య, ఎస్.కె. అమీర్ బాషా, నిడమనూరి ప్రవీణ్.

 జాయింట్ సెక్రటరీలు: సుబ్బారావు, గంగారావు, ఎస్.కె. నాగూర్ వలి, సలీం, దొబ్బకోటి లక్ష్మయ్య, పోలయ్య..

మహిళా కమిటీ:మహిళా దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మహిళా కమిటీని ఏర్పాటు చేశారు.అధ్యక్షురాలు: పి. సునీత సెక్రటరీ: ఎస్.కె. కరీమున్ఉపాధ్యక్షురాలు: పింకీ,జాయింట్ సెక్రటరీ: సుసన్న.

ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ ప్రతినిధులు, దివ్యాంగుల సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొని తమ నిరసనను, విన్నపాన్ని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హజ్రత్ సయ్యద్ షాబుకారీ బాబా ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2025-12-26 10:10:36 0 267
Telangana
బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|
"బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-06 11:48:04 0 131
Andhra Pradesh
మదనపల్లె: పతనమైన టమాటా ధరలు – గిట్టుబాటు కాక రైతుల ఆవేదన.
మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రైతులు దాదాపు 70 మెట్రిక్ టన్నుల...
By Pagadala Venkateswar 2026-03-06 09:27:14 0 181
Telangana
హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ...
By Sidhu Maroju 2025-06-16 18:38:55 0 1K
Andhra Pradesh
దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం...
By Gadiyapudi Narendra 2026-03-17 06:17:18 0 710
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com