అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసిన గద్య అనురాధ

0
387

*మహిళల సాధికారతకు విద్యే పునాది : గద్దె అనురాధ*

 

          విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్ లోని కె.వి.ఎస్.ఆర్ సిద్దార్థ ఫార్మసీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో, SAFE సంస్థ సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో మహిళా హక్కులు, సమానత్వం మరియు సాధికారతపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణాజిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో మహిళల హక్కులు, సమానత్వం మరియు సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి విద్య కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. మహిళల సామర్థ్యాన్ని గుర్తించి వారికి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో “నిజమైన సమానత్వం సాధించడానికి లింగ కోటా అవసరమా?” అనే అంశంపై వాదోపవాద పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులు తమ ఆలోచనాత్మక ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు అని SAFE సంస్థ ప్రతినిధి స్వరూప రాణి తెలిపారు.

కార్యక్రమానికి అతిథిగా హాజరైన సామాజిక కార్యకర్త శ్రీమతి పి.ఏ. దేవి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆచంటి సునీత మాట్లాడుతూ మహిళా దినోత్సవం మహిళల సాధికారతకు ప్రతీక అని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంపొందించి సమానత్వ భావనను పెంపొందించడానికి దోహదపడతాయని ఆమె అన్నారు.

కార్యక్రమంలో నిర్వహించిన వాదోపవాద పోటీల్లో విజేతలకు మరియు పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అని కార్యక్రమ కార్యనిర్వహణాధికారి మరియు మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డా. హెచ్. విజయలక్ష్మి తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముగతి గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం
నందవరం మండల కేంద్రం ముగతి గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం...
By Boya Dasthagiri 2026-04-22 11:05:29 0 208
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన...
By Kothuru Murali 2026-01-20 14:16:18 0 211
Andhra Pradesh
మదనపల్లిలో విషాదం: ఆపరేషన్ వికటించి తల్లి, బిడ్డ మృతి.
మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి...
By Pagadala Venkateswar 2026-03-08 06:49:23 0 171
Andhra Pradesh
Chandrababu Naidu: బీసీసీఐ, ఐసీసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: బీసీసీఐ, ఐసీసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-10 11:49:59 0 198
Andhra Pradesh
పెట్టుబడుల కోసం పోటీకి రెడీ.. తమిళనాడు మంత్రికి లోకేశ్‌ ఫ్రెండ్లీ ఛాలెంజ్!
  పెట్టుబడుల కోసం పోటీకి రెడీ.. తమిళనాడు మంత్రికి లోకేశ్‌ ఫ్రెండ్లీ ఛాలెంజ్!...
By Pagadala Venkateswar 2026-05-29 05:42:27 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com