మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,

0
355

మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, (మన నగర అభివృద్ధి కోసం పాలనా యంత్రాంగం మీ ముందుకు) కార్యక్రమం అప్డేట్స్

 

మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలో గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రతిష్టత్మకంగా చేపట్టిన మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ప్రత్యేక కార్యక్రమంలో బాగాంగా ఈ రోజు 32 వ డివిజన్నందు రోజున స్థానిక రామ్ నగర్ నందు విజయవంతంగా ప్రారంభించడం జరిగింది.

 

 

మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారు, డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్యామహేష్ గార్లు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ గారు,స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నస్పూర్ ఇంచార్జి నూకల రమేష్ ,స్థానిక కాంగ్రెస్ నాయకులు,వార్డు ప్రజలు పాల్గొన్నారు.

 

 ఈ కార్యక్రంలో భాగంగా మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ గారు కలెక్టర్ గారితో కలిసి డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి,తక్షణమే పూర్తి చెయ్యగలిగిన సమస్యలను గుర్తించి యంత్రాంగానికి ప్రత్యేక సూచనలు చేశారు.

 

మేయర్ గారు మాట్లాడుతూ డివిజన్ లో నెలకొన్న తాత్కాలిక సమస్యలైన పారిశుద్యం,నీటి సరఫరా ,విద్యుద్దీపాల పునరుద్ధరణ వంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించమని,కొన్నిoటిని పూర్తి చెయ్యడానికి ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశామని ,ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం నగర పాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడుతుందని,ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియచేశారు.

Like
1
Search
Categories
Read More
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Healthcare and Public Services
Madhya Pradesh continues to strengthen its healthcare system through investments in medical...
By Fathima Safa 2026-06-30 08:36:34 0 96
Andhra Pradesh
Andhra Pradesh Accelerates Urban Development Projects
Andhra Pradesh is advancing urban development through major investments in smart infrastructure,...
By Fathima Safa 2026-06-27 11:16:10 0 349
Andhra Pradesh
Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు.
మంగళగిరిలో ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-03-21 06:15:15 0 203
Telangana
శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళి.|
"దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్న ఎంపీ ఈటల రాజేందర్" హైదరాబాద్, జూలై 6:...
By Sidhu Maroju 2026-07-06 12:28:00 0 149
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప...
By Kothuru Murali 2026-02-11 08:42:59 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com