అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

0
197

*వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*

 

*సతీసమేతంగా పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్*

 

*స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు*

 

మంగళగిరి: మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 12 గం.లకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. అంతకుముందు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వామి వారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Telangana Retired Cops: Guardians Of Road Safety Now
Uniform వదిలినా Telangana retired cops road safety guardians గా కొనసాగుతున్నారు. School zones,...
By Kalaga Sailaja 2026-07-03 11:43:29 0 117
Andhra Pradesh
సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు బిజెపి అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*విజయవాడ*  సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ...
By Rajini Kumari 2026-01-10 12:51:40 0 222
Telangana
మార్చి నేలపై మీమ్స్ ఒక నెలలో ఇన్ని మార్పుల
జనవరి ఫిబ్రవరి నెలలు చిటికెలో గడిచిపోగా . మార్చి నేల మాత్రం నత్తనడకలా సాగుతుందని నెటింట మీమ్స్...
By MERIGE MALLESH 2026-03-27 12:50:16 0 412
Andhra Pradesh
నేడు విజయనగరానికి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు...
By Boiena Rajesh 2026-08-22 05:40:53 0 90
Andhra Pradesh
గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం
*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*   *డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*...
By Rajini Kumari 2026-04-04 15:35:19 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com