Chandrababu Naidu: ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.

0
219

సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు

చెడుపై మంచి గెలుపునకు సూచిక ఈ పండుగ అన్న సీఎం చంద్రబాబు

సమత, మమతలకు హోలీ ప్రతీక అని పేర్కొన్న లోకేశ్

హోలీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను పురస్కరించుకుని ఈరోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు. 

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ‘హోలీ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని తన పోస్టులో పేర్కొన్నారు. 

 

మంత్రి నారా లోకేశ్ తన సందేశంలో.. ‘వ‌సంత రుతువుకు స్వాగ‌తం ప‌లికే రంగుల సంబ‌రం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. స‌మ‌త‌, మ‌మ‌త‌ల‌కు చిహ్నంగా, పేదా, పెద్ద తార‌త‌మ్యాలు లేకుండా, కుల‌మ‌త భేదాలు చూడ‌కుండా రంగుల్లో అంతా క‌లిసిపోయి ఆనందాల‌ను పంచుకునే హోలీ పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్షలు’ అని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు ముమ్మరం.
బుధవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణమండపంలో జరగనున్న బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి...
By Pagadala Venkateswar 2026-06-17 03:52:18 0 115
Rajasthan
Monsoon Hits Rajasthan: IMD Issues Alert For 20 Districts
The Southwest Monsoon has officially intensified across Rajasthan, bringing a much-needed respite...
By Lokeshwari Panthadi 2026-06-27 05:50:10 0 169
Andhra Pradesh
ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
_*తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కుర్ణి...
By Boya Dasthagiri 2026-03-29 13:30:40 0 334
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*...
By Rajini Kumari 2026-04-02 15:57:56 0 224
Jammu & Kashmir
Border Vigil Tightened: White Knight Corps Reviews Security in Poonch-Rajouri
Following the discovery of a militant hideout and the recovery of IED batteries in Rajouri, the...
By Dunna Jessicaruth 2026-05-14 07:49:14 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com