IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!

0
243

IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!

02-03-2026 Mon 14:42 | Both States

 

IMD Issues Heatwave Warning for Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతాయన్న ఐఎండీ

సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పుల ప్రభావం

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం

తమిళనాడులోనూ మూడు నెలల పాటు ఎండల తీవ్రత

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి మే నెల వరకు (ఎంఏఎం సీజన్... మార్చి-ఏప్రిల్-మే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండనుందని స్పష్టం చేసింది. సాధారణంగా వేసవిలో ఉండే ఉష్ణోగ్రతల కంటే ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా వడగాల్పుల రోజులు గణనీయంగా పెరుగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో 2001 తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదు కావడం, చలి తీవ్రత తక్కువగా ఉండటం రాబోయే కఠిన వేసవికి సంకేతాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.

 

తెలంగాణ, ఏపీల్లో పరిస్థితి ఇలా..

ఈ వేసవిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పులు వీచే రోజుల సంఖ్య 3 నుంచి 15 రోజుల వరకు, కొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై సూర్యుడు నిప్పులు చెరిగే ప్రమాదం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట్, హనుమకొండ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

 

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల పైనే నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్సో న్యూట్రల్ పరిస్థితులు ఏర్పడుతుండటంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

 

ఆరోగ్య భద్రత ముఖ్యం

తీవ్రమైన ఎండల కారణంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయట తిరగడం తగ్గించుకోవాలని ఐఎండీ సూచించింది. పెరిగే ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా నీటి వనరులు, విద్యుత్ డిమాండ్‌పైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక సంస్థలు నీటి ఎద్దడి తలెత్తకుండా, వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

 

తమిళనాడులో మిశ్రమ వాతావరణం

మరోవైపు పొరుగున ఉన్న తమిళనాడులోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా మార్చి నుంచి మే వరకు మూడు నెలల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ఉత్తర జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కానున్నాయి. 

 

అయితే, కోమరిన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల ప్రాంతాల్లోని జిల్లాల్లో మాత్రం రాబోయే రెండు నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇది స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణంతో పాటు, చెన్నై వంటి నగరాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Telangana
మామూనూర్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్
వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్ట్  పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయి శనివారం ఏ ఏ ఐ హైదరాబాద్ జి...
By CM_ Krishna 2025-12-28 06:03:41 0 381
Gujarat
Gujarat Accelerates Urban Development and Smart Cities
Gujarat continues to advance urban development through Smart Cities Mission projects, sustainable...
By Fathima Safa 2026-07-02 09:21:23 0 119
Tripura
Shift to Five-Day Workweek and WFH Phase-Out
In a major administrative overhaul, the Tripura Cabinet announced that all state government...
By Dunna Jessicaruth 2026-05-25 11:03:50 0 592
Telangana
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ప్రెస్ మీట్ .|
సికింద్రాబాద్ :తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) జనరల్ సెక్రెటరీ గురువారెడ్డి సికింద్రాబాద్ తాజ్...
By Sidhu Maroju 2025-12-19 13:57:24 0 257
Telangana
ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా...
By Ponnala Srinivasrao 2026-03-16 10:47:22 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com