Alipiri Walkers: తిరుపతిలో వాకర్స్ రాస్తారోకో .. భక్తులకు తీవ్ర ఇబ్బందులు.

0
204

Andhra

 

Alipiri Walkers Protest Disrupts Traffic in Tirupati

తిరుపతి అలిపిరిలో వాకర్స్ నిరసన 

దివ్యరామంలో ప్రవేశ రుసుము వసూలుపై ఆందోళన

కిలోమీటరు మేర నిలిచిపోయిన తిరుమల వాహనాలు

తిరుపతి నగరంలోని అలిపిరి మార్గంలో ఈరోజు ఉదయం వాకర్లు ఆందోళనకు దిగారు. కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో తిరుమల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

 

అలిపిరి సమీపంలోని దివ్యరామంలో ఉన్న నగరవనంలో వాకింగ్ చేసేందుకు నెలకి రూ.100 ప్రవేశ రుసుము చెల్లించాలని అటవీశాఖ అధికారులు కొత్త నిబంధన విధించారు. ఈరోజు ఉదయం రుసుము చెల్లించని వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన వాకర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. డీఎఫ్‌ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు వాకర్స్‌లోని సీపీఎం నేతలు నాయకత్వం వహించారు. 

 

తిరుమల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనాల్లోని భక్తులు, ప్రయాణికులు వాకర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అలిపిరి సీఐ రామకిశోర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి వారికి నచ్చజెప్పడంతో వాకర్లు తమ నిరసనను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Like
1
Search
Categories
Read More
Rangareddy
నల్ల పోచమ్మ అమ్మవారి సేవలో" బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్...
కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్య నగర్ లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను...
By Ponnala Srinivasrao 2026-08-08 01:23:45 0 114
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రికోట రాజీవ్ రెడ్డి గారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ స్టేట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనీ రెడ్డి గారు కలవడం జరిగింది.
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారిని వైఎస్ఆర్ స్టూడెంట్ స్టేట్ యూనియన్...
By Boya Dasthagiri 2026-03-30 02:18:43 0 280
Andhra Pradesh
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కు పాదం విజయవాడలో కఠిన ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం.. విజయవాడలో కఠిన ఆంక్షలు   నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను...
By Rajini Kumari 2025-12-29 08:38:01 0 207
SURAKSHA
AI Cameras Drones Make Tamil Nadu Roads Safer for All DriversSafeRoads
: Tamil Nadu Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-02 05:06:15 0 427
Telangana
బీజేపీ 46వ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరణ & నేతల సన్మానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 46వ ఆవిర్భావ దినోత్సవం...
By Sidhu Maroju 2026-04-06 12:03:20 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com