తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు

0
273

వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన పులగోర వేదమూర్తి (38),  సుమారు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం వెతుకులాట కొనసాగుతుండగా, వేటపాలెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌లో విచారణ జరపగా తన పేరు, చిరునామా వివరాలు వెల్లడించాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా వారు స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన ధృవీకరణ అనంతరం వేదమూర్తిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వేటపాలెం ఎస్సై తెలిపారు.
ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యుడు క్షేమంగా తిరిగి రావడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
Romil Singh Donk: Leading Leh with Vision and Service
A dynamic IAS officer of the AGMUT cadre, Romil Singh Donk serves as the Deputy Commissioner of...
By Lokeshwari Panthadi 2026-07-30 05:33:20 0 135
Andhra Pradesh
సొసైటీ కాలనీలో వివాదం: రీ-బోరును అడ్డుకున్న స్థానికులు.
మదనపల్లెలోని సొసైటీ కాలనీలో సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ మున్సిపల్ బోరుకు 10...
By Pagadala Venkateswar 2026-06-02 04:35:32 0 116
SURAKSHA
Rajesh Kumar IPS: Upholding Law with Integrity and Vision
The Journey Begins "The true strength of policing lies not only in enforcing...
By Fathima Safa 2026-07-23 07:44:07 0 173
Andhra Pradesh
చింతూరు: పోలవరం నిర్వాసితుడికి అన్యాయం – నోటీసులో ఒకలా... ఖాతాలో మరోలా!
పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధితులకు అందాల్సిన నష్టపరిహారం పంపిణీలో అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం...
By Shyamala Yadagiri 2026-08-21 04:12:02 0 157
Telangana
"అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యం: అల్వాల్ ఏసీపీ శంకర్ రాజు ప్రత్యేక చొరవ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా...
By Sidhu Maroju 2026-04-25 11:28:30 0 571
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com