Raghurama Krishnam Raju: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు: రఘురామకృష్ణరాజు.

0
225

ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో గాయపడిన రఘురామకృష్ణరాజు

ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స

ఫోన్‌లో ఆరోగ్య పరిస్థితిని విచారించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

వారికి ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ స్పీకర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

 

ఇటీవల ఏపీ ప్రజాప్రతినిధుల కోసం నిర్వహించిన క్రీడా పోటీల్లో భాగంగా రఘురామకృష్ణరాజు క్రికెట్ ఆడారు. ఆ సమయంలో ఆయన ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.. రఘురామకృష్ణరాజుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు స్పందిస్తూ, "నా ఎడమ చేతి మణికట్టుకు జరిగిన శస్త్రచికిత్స అనంతరం, నా ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పలువురు ఇతర నేతలు, అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన ఆర్.జి.ఐ కమిషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సి ఎస్ విజయానంద్
*నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్.*   అమరావతి,20 జనవరి:...
By Rajini Kumari 2026-01-20 10:35:49 0 200
Telangana
క్రషర్‌ ముసుగు.. అక్రమాలకు అడుగు!.. పాత అసైనీలను ముందుపెట్టి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ డ్రామా
మైనింగ్‌లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు...
By Ponnala Srinivasrao 2026-04-01 04:17:41 0 257
Andhra Pradesh
సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ: ఎమ్మెల్యే.
ఆదివారం రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష 38 మంది లబ్ధిదారులకు రూ. 59 లక్షల విలువైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-23 06:46:23 0 204
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో...
By Kothuru Murali 2026-06-13 15:49:49 0 116
Andhra Pradesh
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం...
By Chennaiah Kati 2026-07-24 07:44:05 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com