బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాలతో బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీస్ అధికారులు...

0
291

బాపట్ల: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగినదని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, బాపట్ల ఇన్-చార్జ్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్ గారి పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో గురువారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

40 ద్విచక్ర వాహనాలు, 4లీటర్ల నాటు సారా స్వాధీనం శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం కార్డెన్ అండ్ సెర్చ్

బాపట్ల టౌన్ సీఐ ఆర్. రాంబాబు నేతృత్వంలో, ఎస్సైలు ఎం. విజయ్ కుమార్, షేక్ నస్రీన్ మరియు 20 మంది సిబ్బందితో కలిసి రాజీవ్ గాంధీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహాత్మాజీపురం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగంపై అనుమానంతో బాయ్స్ హాస్టల్‌లో సైతం తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వేదుళ్లపల్లి ఎస్సై పి. భాగ్యరాజు స్టూవర్టుపురం గ్రామంలో తనిఖీలు నిర్వహించగా, ఒక మహిళ ఇంట్లో 4 లీటర్ల నాటు సారా లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
చందోలు ఎస్సై ఎం. వెంకట శివకుమార్ తన సిబ్బందితో కలిసి స్థానిక ఎస్టీ కాలనీలో తనిఖీలు చేసి, 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కర్లపాలెం ఎస్సై ఎస్. రవీంద్ర, తన సిబ్బందితో కలిసి కొత్త బస్టాండ్ వెనుక ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి, 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పర్చూరు ఎస్సై పి. గోపి ఇందిరా కాలనీలో తనిఖీలు నిర్వహించి, 12 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. గతంలో ఎన్‌డీపీఎస్ (NDPS) కేసుల్లో నిందితుల గృహాలను తనిఖీ చేశారు.
యద్దనపూడి ఎస్సై డి. రత్నకుమారి, స్టేషన్ సిబ్బంది అనంతవరం ఎస్టీ కాలనీలో తనిఖీలు చేపట్టి, 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గంజాయి వంటి మత్తు పదార్ధాల వలన కలిగే దుష్పరిణామాలు గురించి ప్రజలకు వివరించారు. వాహనదారులు ప్రతి ఒక్కరు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాలతో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ముఖ్య ఉద్దేశంతో ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో బాపట్ల టౌన్‌లో 10, రూరల్‌లో 3, చందోలులో 3, కర్లపాలెంలో 5, పర్చూరులో 12, యద్దనపూడిలో 7, మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సరైన పత్రాలు లేనందున సీజ్ చేయడం జరిగిందన్నారు. వేదుళ్లపల్లి పరిధిలోని స్టూవర్టుపురంలో జరిపిన సోదాల్లో ఒక మహిళ ఇంటి వద్ద 4 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ఇటువంటి తనిఖీలు నిరంతరం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో లేదా పట్టణాల్లో కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నేరగాళ్లకు ఆశ్రయం కల్పించడం కూడా నేరమేనన్నారు. ప్రతి వాహనదారుడు తమ వాహనానికి సంబంధించిన సరైన ధృవపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేని పక్షంలో అనుమానాస్పద వాహనంగా భావించి సీజ్ చెయ్యడం జరుగుతుందని హెచ్చరించారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు, వ్యసనాలకు దూరంగా ఉండి తమ లక్ష్య సాధనకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసితే వెంటనే స్థానిక పోలీసులకు (లేదా) టోల్ ఫ్రీ నెంబర్ 112కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో...
By Kothuru Murali 2026-06-13 15:49:49 0 116
Bharat Aawaz
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
By Bharat Aawaz 2025-06-25 10:14:58 0 2K
Andhra Pradesh
బొత్స త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్
శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న డిప్యూటీ...
By Boiena Rajesh 2026-02-27 14:14:56 0 361
Andhra Pradesh
అలాంటి వాటిని నమ్మకండి: పుంగనూరు కమిషనర్
పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేరుతో కొందరు వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తూ, ఇంటి,...
By Kothuru Murali 2026-03-02 04:05:08 0 176
Andhra Pradesh
ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి సాయం ఎందుకు అందించలేదు?
కాలనీ: KVR Colony, ఇస్కదమర్ల గ్రామం, కొండపురం మండలం, SPSR నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ –...
By VALLERU SIMHADRI 2026-08-11 03:34:32 0 349
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com