Andhra Pradesh Weather: ఏపీలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు.. మార్చిలో భానుడి భగభగలు!

0
215

మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక

దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉందన్న ఐఎండీ

ఏపీలో మార్చి తొలివారంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్న అమరావతి వాతావరణ కేంద్రం

అనంతపురంలో గురువారం అత్యధికంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

 

వాతావరణ మార్పుల ప్రభావంతో వేసవి కాలం రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మార్చి నెలలోనే ఎండలు, ఉక్కపోత తీవ్రంగా ఉండనున్నాయి. 

 

రాజస్థాన్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పశ్చిమ, దక్షిణ భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్చి తొలి రోజుల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. 

 

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికే రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. అనంతపురంలో అత్యధికంగా 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, కావలి వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు...
By Boiena Rajesh 2026-07-18 05:14:43 0 157
Telangana
🗳️ గ్రామాభివృద్ధికి ఓటుతో మార్గం! – తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో
గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం ఓట్ల పండుగ కాదు – ఇది గ్రామ ప్రజల చేతిలో అభివృద్ధికి...
By Pulse 2025-06-25 10:04:17 0 1K
Telangana
నిజామాబాద్
ఇందూరు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ముత్తూట్ ఫైనాన్స్ వారు నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్షల క్యాంపు...
By Sadaq Sadaq 2026-05-26 06:59:23 0 115
Telangana
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.|
● ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్ట్.. 16 మంది వినియోగదారులు అదుపులో ● 95.41 గ్రాముల MDMA, 50...
By Sidhu Maroju 2026-08-19 14:36:57 0 132
SURAKSHA
Hari Chandana Dasari IAS: Driving Innovation in Governance
A visionary Telangana IAS officer transforming governance through sustainability, innovation,...
By Lokeshwari Panthadi 2026-07-10 11:01:13 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com