Educational system

0
128

తెలంగాణ విద్యా కమిషన్ అందించిన నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన అంశాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, ఆ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు గారి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. 

 

❇️ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారితో పాటు కమిషన్ సభ్యులు తెలంగాణ విద్యా విధానంపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి గారికి సమర్పించారు.

 

❇️ అమెరికా, వియత్నాం, మలేసియా వంటి దేశాల్లో స్వయంగా పర్యటించడంతో పాటు వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలను పరిశీలించి నివేదిక రూపొందించినట్లు ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి గారికి నివేదికలోని అంశాలను సుదీర్ఘంగా వివరించారు. నివేదికలోని అంశాలను తెలుసుకున్న అనంతరం ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు.

 

❇️ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, డాక్టర్ కె కేశవరావు గారు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి గారు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి గారు, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి గారు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి గారు, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ గారు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు, విద్యా కమిషన్ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీడా మైదానం, ఇత‌ర అన్ని ర‌కాల వ‌స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ని ఆదేశించారు.

 

❇️ కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో విద్యా శాఖపై ముఖ్య‌మంత్రి గారు స‌మీక్ష నిర్వ‌హించారు. నాణ్య‌మైన విద్య‌కు చిరునామాగా తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దాల‌ని పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి గారు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

 

❇️ కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (CURE) ప‌రిధిలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల త‌ర‌హాలో నిర్మించాలి. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని, ఏడాదిలో క్యూర్ ప‌రిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూత‌న పాఠ‌శాల‌ల నిర్మాణం పూర్తి కావాలి.

 

❇️ హైదరాబాద్ లోని భార‌తీయ విద్యా భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్ల‌లో ఉండే అన్ని వ‌స‌తులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల్లో ఉండాలి.

 

❇️ క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న 164 పాఠ‌శాల‌ల ప‌నుల్లో ఎటువంటి రాజీ ప‌డ‌కూడ‌రాదు.

 

❇️ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 99 రోజుల పాటు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాల‌కు కేటాయించాలి. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఇత‌ర అంశాల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలి.

 

❇️ కృత్రిమ మేథ (AI) ప్ర‌పంచాన్ని శాసిస్తున్న నేప‌థ్యంలో పాఠ‌శాల స్థాయి నుంచి దాని బోధ‌న‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాలి. మారుతున్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఏర్పాటు చేయాలి.

 

❇️ సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణ‌మైన మార్పుల‌ను తీసుకురావాలి. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాలి.

 

❇️ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్ర‌తి విద్యార్థికి పాలు అంద‌జేయాలి. పాల‌ను విజ‌యా డెయిరీ నుంచి సేక‌రించాలి. విద్యార్థుల‌కు ఎన్ని క్యాల‌రీలు అంద‌జేస్తున్నామ‌నేది తెలుసుకునేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించాలి.

 

❇️ పాఠ‌శాల విద్యార్థుల‌కు స్కూల్ యూనిఫాం, పుస్త‌కాల‌తో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అంద‌జేయాలి. ఆ కిట్ లో స్కూల్ బ్యాగ్‌, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప‌న‌ర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్ష‌న‌రీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బ‌డ్జెట్‌లో పొందుప‌ర్చాలి.

 

❇️ పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంట‌నే ప్రారంభించాలి. కాలం చెల్లిన కోర్సుల‌ను తొల‌గించాల‌న్నారు. పాలిటెక్నిక్‌, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంట‌నే వివిధ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు ల‌భించేలా చూడాలి.

 

❇️ రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు కేటాయిస్తాం. ఇప్ప‌టికే ఉస్మానియా యూనివ‌ర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, మిగ‌తా వ‌ర్సిటీల‌కు ఎంత నిధులు అవ‌స‌ర‌మ‌నే దానిపై నివేదిక స‌మ‌ర్పించాలి.

 

❇️ ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజుల నియంత్ర‌ణ‌కు సంబంధించి తెలంగాణ ప్రైవేటు పాఠ‌శాల‌ల ఫీజు రెగ్యుల‌ట‌రీ మానిట‌రింగ్ క‌మిష‌న్ త‌మ నివేదికలోని అంశాల‌ను ముఖ్య‌మంత్రి గారి ముందుంచారు. వివిధ రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉన్న విధానాలు, తెలంగాణ‌లో తీసుకోవాల్సిన అంశాల‌ను వివ‌రించారు.

 

❇️ వివరాలు తెలుసుకున్న అనంతరం జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్‌, డీఈవోల నేతృత్వంలో పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి ఫీజుల నిర్ణ‌యంపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయిలోని క‌మిటీ తుది క‌మిటీగా ఉండి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని తెలిపారు.

 

❇️ అలాగే ఫీజు నియంత్ర‌ణ‌కు సంబంధించి విద్యార్థుల త‌ల్లిదండ్రులు, మేధావులు, సామాజిక‌వేత్త‌ల అభిప్రాయ సేక‌ర‌ణ‌కు ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచాల‌ని సూచించారు. ఈ సమావేశంలో విద్యా కమిషన్ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు వెస్ట్ డీస్పీ శ్రీ కె. అరవింద్ గారు విద్యార్థులకు మాదగద్రవ్యాల అవగాహన సదస్సు సంకల్పం కార్యక్రమం చేసినారు. గుంటూరు జిల్లా ఎస్పీ మరియు ఐజి ఆదేశాల మేరకు.
గుంటూరు జిల్లా పోలీస్...* *పట్టాభిపురం పోలీస్ స్టేషన్* *తేది: 31.12.2025* _*//“డ్రగ్స్...
By KOTESWARARAO KVSR 2025-12-31 12:18:11 0 738
Madhya Pradesh
Charak Hospital Trauma Team Battles to Save Ujjain Stabbing Victim
In a critical response to escalating urban violence, local medical professionals at Charak...
By Lokeshwari Panthadi 2026-06-27 08:20:08 0 80
Andhra Pradesh
తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి.
    తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి...
By Pagadala Venkateswar 2026-06-14 06:21:45 0 66
SURAKSHA
The Visionary Administrator: The Story of Shri. Sandeep Kumar, IAS
From IIT to IAS: Redefining Public Service Excellence:  Shri. Sandeep Kumar, a...
By Kalaga Sailaja 2026-07-18 11:29:31 0 35
Telangana
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనపై ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో అవగాహన సదస్సు
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన...
By Jagadeesh Babu 2026-06-19 15:07:53 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com