నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో కుల ఉన్మాదుల దాడి – 2 నెలల చిన్నారి మౌనిక మృతి బొల్లికుంట గ్రామస్తుల అశృనివాళి

0
519

నాగూర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలచివేసింది. కేవలం రెండు నెలల పసికందు మౌనిక కుల ఉన్మాదానికి బలైపోవడం మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది.

ఇది కేవలం ఒక కుటుంబం విషాదం మాత్రమే కాదు – ఇది సమాజం మొత్తానికి మచ్చ. కులం పేరుతో ద్వేషం పెంచుకుంటూ చివరకు అమాయక శిశువు ప్రాణం తీసే స్థాయికి చేరుకోవడం ఎంత దారుణమో మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

కుల వివక్ష భారత రాజ్యాంగం నిరాకరించిన దుష్ప్రవర్తన. సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం – ఇవే మన రాజ్యాంగ మూల సూత్రాలు. కానీ ఇంకా కొన్ని చోట్ల కుల విద్వేషం పేరుతో అమానుష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం.

ఈ ఘటనపై బొల్లికుంట గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నారి మౌనికకు అశృనివాళులు అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు – అందరూ కలిసి ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కుల విద్వేషానికి బదులు మానవత్వాన్ని పెంపొందించేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి.

Search
Categories
Read More
Business & Finance
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...
By Bharat Aawaz 2025-07-02 17:43:35 0 2K
Jharkhand
Jharkhand Boosts Employment and Startup Growth in 2026
Jharkhand has continued to strengthen employment generation and entrepreneurship initiatives...
By Fathima Safa 2026-07-01 09:51:12 0 181
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్...
By Pagadala Venkateswar 2026-08-31 13:02:10 0 80
Nagaland
CBI Raids in Nagaland–Tripura–Assam Academic Corruption Case
The CBI launched raids on July 12 in Nagaland (Lumami), Assam (Jorhat), and Tripura (Agartala),...
By Bharat Aawaz 2025-07-17 07:53:56 0 1K
Andhra Pradesh
మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు...
By Boiena Rajesh 2026-04-19 04:04:51 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com