దళిత ద్రోహి మాజీ సీఎం జగన్ వర్ల రామయ్య కామెంట్స్

0
202

*మంగళగిరి,*

*తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,*

*ది : 23-02-2026.*

 

*దళిత ద్రోహి జగన్ - అతని ఐదేళ్ల పాలనలో దళితుల ఊచకోత* 

*తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య*

 

దళిత ద్రోహి జగన్ - అతని ఐదేళ్ల పాలనలో దళితుల ఊచకోత కోసారని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాడు. ఆయన ఐదేళ్ల పాలనలో దళిత వ్యతిరేకిగా ముద్ర పడ్డాడు. దళిత ద్రోహిగా తనని తానే రుజువు చేసుకున్నాడు. దళితులు మాకు మేనమామలు.. మాకు బంధుత్వం ఉందని చెప్పి.. పదేపదే చెప్తు ఉంటాడు. అదంతా కూడా అబద్ధమే. ఆయన బంధువుల అభివృద్ధికి ఎప్పుడూ కూడా కాంక్షించలేదు.. దళితులను ఊచకోత కోసిన వ్యక్తి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పాలనలో దళితులు అనేక ఇబ్బందులకు గురై చాలా బాధలు పడ్డారు. అనంతబాబు ఒక దళితుడిని చంపి.. శవాన్ని డోర్ డెలీవరి చేసిన కేసులో ఖాకీ – ఖద్దర్ రెండు కుమ్మక్కైయ్యాయని నిన్న కాక మొన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీని వల్ల దళితులకు అన్యాయం జరిగింది. కేసు సజావుగా సాగలేదు. కేసు దర్యాప్తు నానా విధాలుగా నడిచింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చూసిన తరువాత దళితులు మీకు ఎలా బంధువులు జగన్ రెడ్డి గారు..? దళితులు ఏ రకంగా మేనమామలు జగన్ రెడ్డి గారు..? జగన్ రెడ్డి దళితులను అసహించుకున్నారు. దళితులను వేటాడి.. వెంటాడి.. బలి తీసుకున్నారు. అనంతబాబు దళితుడిని చంపి.. డోర్ డెలివరీ చేసి.. ‘‘బతికి ఉంటే అసుపత్రికి తీసుకువెళ్లండి.. చస్తే స్మశానానికి తీసుకువెళ్లండి’’ అని అహంకారంలో మాట్లాడాడు. దీనికి కారణం జగన్ రెడ్డి వత్తాసు, మద్దతే కారణం. సుప్రీం కోర్టు అదేశించిన నేపథ్యంలో దళితుల అభివృద్ధిని కోరుకునే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నాలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. దానితో సరిపోలేదు.. అసలు పోలీసు అధికారి అనాటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. అనంతబాబు తన చుట్టం అయినట్లు, తన తమ్ముడే ఈ హత్య చేసి రక్షించినట్లుగా వ్యవహరించాడు. ముద్దాయి కూడా అనంతబాబు గారు అని వ్యాఖ్యానించడం.. అతను ఏ రకంగా ఈ కేసులో అనంతబాబు రక్షించడానికి తాపత్రయపడ్డాడో అర్థమైంది. దళితులందరూ కూడా ఆ ఎస్పీపై కోపంగా ఉన్నాయి. ఎస్పీ తీరుతో మేమంతా రోడ్ల మీదకు వచ్చి అందోళనలు చేశాం. అనాడు ఐజీగా ఉన్న వ్యక్తి ఈ కేసును పర్యవేక్షించాడు. అనాడు డీజీపీగా వ్యక్తి డీజీపీగా ఉండే అర్హత ఉందా...? అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే సంబంధిత నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎస్పీ రిటైర్ అయ్యాడు. అక్కడి రేంజ్ ఐజీ కూడా ముద్దాయికే మద్దతు పలికాడు. అసలు ఎవరినీ కూడా వదలటానికి వీల్లేదు.. రాష్ట్రానికి డీజీపీగా ఉండి.. కేసును నీరుగార్చారు. వీరందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా జగన్ రెడ్డి అధికార దాహనికి గురైన దళిత బాధితులు చాలా మంది ఉన్నారు. వారందరి కేసులను కూడా పున:సమీక్షించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అవసరమైతే ఒక కమీషన్ వేయండి.. ఒక కమిటీ వేయండి.. ఒక సిట్ వేయండి.. అనాడు డాక్టర్ సుధాకర్ కావొచ్చు.. శిరోముండనానికి గురైన వరప్రసాద్ కావొచ్చు. రాజమండ్రిలో పోలీసు స్టేషన్ వెనుకే ఉన్న ఒక గదిలో మానభంగానికి గురైన దళిత మహిళ కావొచ్చు. మాస్క్ పెట్టుకోలేదని చావకోట్టిన కిరణ్ కుమార్ కావొచ్చు.. మద్యం రేట్లు పెరిగాయి.. కల్తీ మద్యం అని వ్యాఖ్యానించి చనిపోయిన ఓం ప్రతాప్ కావొచ్చు.. జగన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన పులివెందులలో మానభంగానికి గురై, హత్యకు గురైన నాగమణి కావొచ్చు.. ఇటువంటి కేసుల మీద సిట్ ను ఏర్పాటు చేసి దళితులకు న్యాయం చేయాలి. జగన్ రెడ్డి పాలనలో దళితుల చాలా అన్యాయానికి గురైయ్యారు. సీఎంగా ఉన్న జగన్ రెడ్డే దళిత వ్యతిరేకి. కనుక, ఆయన పాలనలో కాలంలో కొన్ని కేసులను బయటకు తీసి సిట్ వేసి సమీక్షించి ఏ రకంగా పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకున్నారో.. ఏ రకంగా అ కేసులను నీరుగార్చి సరైన రీతిలో దర్యాప్తు చేయకుండా.. ఖాకీ – ఖద్దర్ ఏ రకంగా దళితులకు అన్యాయం చేశారో.. సమీక్షించి సిట్ చేసి దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. జగన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చారు. జగన్ రెడ్డి దళిత వ్యతిరేకి.. దళితుల అభ్యున్నతి పట్ల జగన్ రెడ్డి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. అనాడు జగన్ రెడ్డి అదేశించాడు.. కాకినాడ ఎస్పీ పాటించాడు.. ఫలితం కేసు నీరుగారిపోయింది. ముద్దాయి డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. జగన్ రెడ్డి పాలనలో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సరిగ్గా సాగాలేదు. జగన్ రెడ్డి సీఎం అయిన తరువాత చంద్రబాబు నాయడు పాలనలో దళితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన 27 పథకాలను రద్దు చేశాడు. ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల మీద దాడులు పెరిగాయని రాజ్యసభలో అనాటి కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర మంత్రే ఈ రకంగా చెప్తే జగన్ రెడ్డి దళిత ద్రోహి కాదా..? దళిత వ్యతిరేకి కాదా..? దళితులను ఊచకోత కోయించిన వ్యక్తి కాదా..? అని అడుగుతున్నా. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 56,981 మంది దళితుల మీద దాడులు జరిగాయి. 192 మంది దారుణంగా హత్యకు గురైయ్యారు. కాదని చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా..? అనంతబాబు మీద జగన్ రెడ్డి చూపించిన ప్రేమ దళితులకు ఎంత ద్రోహం చేసిందనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. అత్మపరిశీలన చేసుకోవాలి. హత్య కేసులో మద్దాయిగా ఉన్న వ్యక్తి జైలు నుంచి బెయిల్ మీద బయటకు వస్తే మీరు చేసిన హాంగామా ఎంత వరకు సబబు జగన్ రెడ్డి..? దళితులు ఎవరూ కూడా జగన్ రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దు.. ఛార్జీషిట్ లో ఏ1గా అనంతబాబు, ఏ2గా అనంత లక్ష్మీ దుర్గ అలీయస్ రోజా (అనంతబాబు భార్య)గా పేర్కొన్నారు. దర్యాప్తు చాలా బాగా చేశారు. సాక్ష్యాదారాలను బాగా సేకరించారు. ఈ కేసులో అనంతబాబు, అతని భార్య ఎట్టిపరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరు’’ అని అన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
 🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ...
By Chunarkar Jagadeesh 2026-06-30 16:49:25 0 267
Telangana
కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి...
By Sunka Santhosh 2026-08-02 18:17:35 0 209
Telangana
At a time 5 operations continue 36 hours
ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన...
By G k Nookala 2026-07-01 14:30:00 0 165
Haryana
Haryana Accelerates Employment and Economic Growth
Haryana continues to strengthen its position as one of India's fastest-growing economies through...
By Fathima Safa 2026-06-30 12:27:57 0 183
Andhra Pradesh
మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.
      మదనపల్లె శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మదనపల్లె పట్టణ సమీపంలోని...
By Pagadala Venkateswar 2026-02-16 04:58:17 0 390
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com