YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.

0
198

రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి!

ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ

 

ఒకే పాల వ్యాపారి నుంచి పాలు కొన్న బాధితులు

పలువురి పరిస్థితి విషమం.. ఆసుపత్రిలో చికిత్స

రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి నలుగురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఆహార భద్రత అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని జగన్ ఆరోపించారు. ఈ దారుణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.

 

బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగాలని, అవసరమైతే నిపుణులైన వైద్య బృందాలను పంపాలని జగన్ కోరారు. ఆహార భద్రత తనిఖీలను కట్టుదిట్టం చేసి, పాల వంటి నిత్యావసరాలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.

 

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా నలుగురు మరణించారు. మూత్రం రాకపోవడం (అనూరియా) లక్షణాలతో వీరు మృతి చెందగా, దీనికి కల్తీ పాలే కారణమని అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి ఎస్. శేషగిరిరావు (72), రాధా కృష్ణమూర్తి (74) మరణించారు. అంతకుముందు మరో ఇద్దరు చనిపోయారు.

 

ఈ నెల‌ 15 నుంచి సుమారు 14 మంది అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. బాధితులంతా ఒకే పాల వ్యాపారి వద్ద పాలు కొనుగోలు చేయడంతో కల్తీ జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Prop News
PROPIINN Uncovers the Real Story Behind Every Property
Before You Buy, Know the Ground Because every property has a story—PROPIINN helps you read...
By Bharat Aawaz 2025-06-26 05:45:12 0 2K
Andhra Pradesh
భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ.
  భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-06-24 04:28:11 0 105
Andhra Pradesh
Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు...
By Pagadala Venkateswar 2026-01-19 06:41:32 0 220
Telangana
హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు వినతులు.|
'మాస్టర్ ప్లాన్ రహదారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలు" మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-07-11 08:55:10 0 145
Andhra Pradesh
Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.
పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు...
By Pagadala Venkateswar 2026-01-23 10:54:30 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com