నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు కేశినేని చిన్నికి ఆహ్వానం

0
192

*ప్ర‌చుర‌ణార్థం* *22-02-2026*

 

నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)కు ఆహ్వానం

ఆహ్వాన పత్రిక అందించిన ఆల‌య ఎ.సి సంధ్య‌, ప్రధాన అర్చకులు టి.గోపాల‌చార్యులు

పూటి లాగుడు ప్ర‌ద‌ర్శ‌న క‌ర‌ప‌త్రం ఆవిష్క‌రించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ 

 

 

విజ‌య‌వాడ : తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం గంపలగూడెం మండలం లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి వేణుగోపాల స్వామి వార్షిక‌ బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను నెమలి వేణుగోపాల స్వామి ఆల‌య అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఎన్.సంధ్య ఆహ్వానించారు. ఆదివారం గురునాన‌క్ కాల‌నీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిశారు. 

 

ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5 వరకు వైభవంగా జ‌రుగుతాయ‌ని, శ్రీ స్వామి వారి క‌ళ్యాణ‌ము మార్చి 2వ తేదీ రాత్రి 9 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని తెలిపి ఆహ్వాన ప‌త్రిక అందించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఈ బ్ర‌హ్మోత్స‌వ‌ముల పుర‌స్క‌రించుకుని మార్చి 4వ తేదీ నుంచి మార్చి 5 తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే పూటి లాగుడు ప్ర‌ద‌ర్శ‌న కి సంబంధించిన క‌ర‌ప‌త్రం ఆవిష్క‌రించారు. 

 

నెమలి వేణుగోపాల స్వామి తీర్ధ ప్రసాదాలు, శేష వస్త్రం ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు అందజేశారు. అనంత‌రం నెమలి వేణుగోపాల స్వామి వార్షిక‌ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు గురించి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అడిగి తెలుసుకున్నారు. 

 

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఉప ప్ర‌ధాన అర్చ‌కులు టి.గోపాలచార్యులు, దేవ‌స్థానం మాజీ చైర్మ‌న్ బెల్లం మ‌ధుసూధ‌న‌రావు, గంప‌ల గూడెం మాజీ జెడ్పీటీసీ స‌భ్యులు పామ‌ర్తి కొండ‌ల‌రావు, దేవ‌స్థానం మాజీ స‌భ్యులు చిన్న అనంత‌రామ‌య్య ల‌తో పాటు ఆల‌య సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆకట్టుకున్న ఆదర్శ పాఠశాల అలంకరణ.
పెద్దమండ్యం బస్టాండ్ వద్దగల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 'మెగా పేరెంట్స్ మీటింగ్' సందర్భంగా చేసిన...
By Pagadala Venkateswar 2026-07-25 10:20:21 0 97
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:15:10 0 3K
West Bengal
'We are with centre, but they cannot decide our representative': Mamata Banerjee on Op-Sindoor outreach
West Bengal Chief Minister Mamata Banerjee has reaffirmed her party’s support for the...
By BMA ADMIN 2025-05-19 18:06:33 1 2K
Telangana
Karimnagar: యుద్ధం ప్రభావంతో మూతపడుతున్న పెట్రోల్ బంకులు!
Karimnagar 
By Sunka Santhosh 2026-03-25 09:45:18 0 315
Andhra Pradesh
రేపు మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం... పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ...
By Pagadala Venkateswar 2026-07-31 10:00:26 1 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com